YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సిటీలో కలవరపెడుతున్న కరోనా

సిటీలో కలవరపెడుతున్న కరోనా

సిటీలో కలవరపెడుతున్న కరోనా
హైద్రాబాద్, మార్చి 28
కరోనా గ్రేటర్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోందనేందుకు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులే నిదర్శనం. తెలంగాణలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీటిలో 27 కేసులు హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే కావడం నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. విదేశాలకు వెళ్లివచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఇద్దరు గృహిణులు, ఓ యువకుడు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా దోమలగూడకు చెందిన వైద్య దంపతులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే శంషాబాద్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించే ఓ స్టాఫ్‌ నర్స్‌ కూడా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్వీయ నియంత్రణపై నిర్లక్ష్యం కారణంగానే థర్డ్‌ ఇంపాక్ట్‌ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారో తెలియని పరిస్థితి నగరవాసిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రెండో దశ చివరి అంకంలో ఉంది. స్వీయనియంత్రణ లేకుంటే మాస్‌ క్యాజువాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.  కాగా.. నగరంలో నిత్యావసర వస్తువులకు ఎటువంటి కొరత లేదని సీపీ అంజనీ కుమార్‌  స్పష్టం చేశారు. 77,045మార్చి 24 వరకువిదేశాల్లో పర్యటించిశంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వారు 17,283వీరిలో దగ్గు, జలుబు,జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించినవార 856వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం సేకరించిన నమూనాలు 45వీటిలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు 699ఐసోలేషన్‌ వార్డులో చేరి,నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారు 113 వ్యాధి నిర్ధారణపరీక్షల రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నవారు 33 ప్రస్తుతంగాంధీలోని పాజిటివ్‌ కేసులు10ఛాతీ ఆస్పత్రిలో ఉన్న పాజిటివ్‌ కేసులు01చికిత్స అనంతరం కోలుకుని,డిశ్చార్జి అయినవారు.
 

Related Posts