YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

వాట్సప్ వదంతులు... కేసులు నమోదు

వాట్సప్ వదంతులు... కేసులు నమోదు

వాట్సప్ వదంతులు... కేసులు నమోదు
కర్నూలు మార్చి 28
కర్నూలు జిల్లాలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వ్యక్తులపై ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయింది.  ఈమేరకు కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలు జారీ చేసారు. కరోనా వ్యాధీ నేపధ్యంలో స్వీయ నియంత్రణ అమలు చేయడానికి కర్నూలు జిల్లా కు ఆర్మీ ఫోర్సు వచ్చిందని సోషల్ మీడియాలో ఫేక్ మేసేజ్ పెట్టి సర్య్కులేట్ చేసిన  అనుమానస్పద వ్యక్తిపై ఒక కేసు నమోదయింది.  సంజామాల మండలంలో ఒక మెడికల్ విద్యార్దికి కరోనా వైరస్ వచ్చిందని సోషల్ మిడియాలో ఫేక్ మార్ఫింగ్  ఫోటో పెట్టి సర్క్యులేట్ చేసిన   ఇద్దరు వ్యక్తులపై    సెక్షన్ 54 ఆఫ్ విపత్తు నిర్వహణ చట్టం క్రింద  కేసులు  నమోదు చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు.

Related Posts