YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయల ను ఏర్పాటు: పువ్వాడ

 అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయల ను ఏర్పాటు: పువ్వాడ

 అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయల ను ఏర్పాటు: పువ్వాడ
ఖమ్మం మార్చ్ 28
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయల ను ఏర్పాటు చేస్తున్నదని, అందువల్ల ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని, కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో మంత్రి వ్యక్తిగత సెక్యురిటి, నాయకులు  లేకుండా ఒకే వాహనంలో ఒక్కరే మంత్రి పువ్వాడ  ఖమ్మం వైరా రోడ్(హావేలి రెస్టారెంట్ పక్కన) లోని మోర్ సూపర్ మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించి ప్రజలతో, స్టోర్ సిబ్బందితో మాట్లాడారు. ఒకవేళ ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. అలాగే డివిజన్ ప్రజల సౌకర్యార్థం డివిజన్లకు అనుసంధానంగా  రైతు బజార్ లో నిత్యావసర సరుకులు, కూరగాయల అందుబాటులో ఉంచామన్నారు. సాధారణ ధరలకు పెంచి అమ్మితే పిడి యాక్ట్ బుక్ చేస్తామని హెచ్చరించారు.ఇప్పటికే మార్కెట్ లో ధరల పట్టికను ఏర్పాటు చేశామని, విధిగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుందన్నారు.సీఎం కెసిఆర్ చెప్పినట్లుగా ప్రజలు లాక్ డౌన్ ని పాటించాలని చెప్పారు.కరోనా అంతమయ్యే వరకు ప్రజలు సంయమనం పాటించాలని మంత్ర పువ్వాడ కోరారు.

Related Posts