కరోనాతో ఇటలీలో 45మంది వైద్యుల మృతి
న్యూ ఢిల్లీ మార్చ్ 28
కరోనా మహమ్మారి ప్రజలనే కాదు.. వారికి ప్రాణాలు ఒడ్డి చికిత్స నందిస్తున్న వైద్యులను కూడా వదలడం లేదు. ఇటలీలో విశృంఖలంగా వ్యాపించిన వైరస్ పై పోరాడుతున్న 45 మంది వైద్యులను కూడా కరోనా వైరస్ కబళించినట్లు తాజాగా ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం దారుణ విషయాన్ని తెలిపింది. తాజాగా వైద్య పరీక్షల్లో 45మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ చ్చిందని తెలిపింది. ఇటలీలో వైద్య రక్షణ పరికరాల కోసం అత్యవసరంగా పిలుపునిచ్చారు.కొరత తీవ్రంగా ఉంది. అరకొర వసతులతో చికిత్స చేసిన వైద్యులకు కరోనా సోకింది. పరిస్థితి తీవ్రమై వారు కూడా మరణించిన దుస్థితి నెలకొంది.ఇటలీలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న 6వేలకు పైగా వైద్యులు నర్సులు ఆరోగ్య కార్యకర్తలకు కూడా కరోనా సోకిందని ఇటలీ తెలిపింది. ఇప్పటివరకు 8వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 80వేల మందికి పైగా కరోనా కేసులు ఇటలీ లో నమోదయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు ఇటలీలో సంభవిస్తున్నాయి. ఇక కేసుల్లో ఇటలీని అమెరికా దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా 24వేల మంది మరణించగా.. యూరప్ ఖండంలోనే 80శాతం మంది అసువులు బాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.