YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

మార్చురీ గా మారిన బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టు

మార్చురీ గా మారిన బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టు

మార్చురీ గా మారిన బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టు
లండన్ మార్చ్ 28 
చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ యూరప్ ను అతలాకుతలం చేస్తోంది. స్వయంగా బ్రిటన్ ప్రధాని కి కూడా కరోనా సోకడం యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. బ్రిటన్ దేశంలో మరణాల రేటు ఎక్కువై పోతోంది. 15 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లండన్ తర్వాత మిడ్ లాండ్స్ లో కరోనా మరణాలు కలవరపెడుతున్నాయి.  దీంతో అక్కడ స్మశానాలు ఫుల్ అయిపోయాయి. దీంతో చేసేందేం లేక ప్రఖ్యాత బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టును మార్చురీగా మార్చేశారు. ఇంతటి దారుణమైన పరిస్థితి బ్రిటన్ లో దాపురించింది. బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి సెక్రెటరీకి కూడా కరోనా సోకింది. శనివారం వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా 597267 లక్షల మందికి సోకింది. ఇందులో 27365 మంది మరణించారు. ఇందులో అత్యధికులు యూరప్ దేశలకు చెందిన వారే కావడం అక్కడ మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది.బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా మార్చురీ గదులను ఏర్పాటు చేస్తున్నారు. 1500 మృతదేహాలను భద్రపరిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టును మార్చురీగా మార్చడం ఎవరికి ఇష్టం లేకున్నా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేక తప్పలేదని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఇటలీ లోనే సుమారు 10వేల మంది మరణించారు. స్పెయిన్ లో 5వేలు ఫ్రాన్స్ లో 1700 యూకే లో 759మంది మరణించారు.
 

Related Posts