YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రి అందుబాటులోకి రానున్నది ...జిల్లా కలెక్టర్

తిరుపతిలో కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రి అందుబాటులోకి రానున్నది ...జిల్లా కలెక్టర్

 లాక్ డౌన్ పీరియడ్  ఇళ్ల కే పరిమితం కావాలి
అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు



తిరుపతిలో కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రి అందుబాటులోకి రానున్నది
...జిల్లా కలెక్టర్
తిరుపతి , మార్చి 28 
రానున్న రోజులు మరింత క్లిష్టమైనవి లాక్ పీరియడ్ లో ప్రజలు ఇళ్ల కే పరిమితం కావాలని అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లాక్ డౌన్ పీరియడ్ లో ఇళ్లకే పరిమితి కావాలని, కుటుంబ అవసరాలకు వస్తువులు ఇంటినుండి ఒక వ్యక్తే కేటాయించిన సమయంలో బయటకు వచ్చి కొనుగోలు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రులు 4 ఏర్పాటుకు ప్రభుత్వం సూచించింది, అందులో ఒకటి తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిని గుర్తించామని అన్నారు. ఇందులో భాగంగా అవసరం వున్న ఎక్విప్ మెంట్, వెంటిలేటర్లరు ఇవ్వడానికి టిటిడి ముందుకు వచ్చిందని  ప్రణాళిక సిద్ధం చేసి టిటిడి ఇఓ వారికి అందించనున్నామని తెలిపారు. ప్రధానంగా విదేశాల నుండి వచ్చి14 రోజులు హోమ్  ఐసోలేషన్ లో ఉండాలనే నిబంధన పాటించాలని,  అతిక్రమ్మిస్తే ప్రభుత్వ ఐసోలేషన్ కు తరలిస్తామని తెలిపారు. జిల్లాలో 2057 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారున్నారని అందులో 1209 మంది రూరల్ ప్రాంతాల్లో,848 మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారని  1184 మంది 14 రోజులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటికే సరుకులు అందించే వ్యవస్థ ఏర్పాటు, పలుచోట్ల కాయకూరలు అందుబాటులోకి తీసుకోవచ్చామని ప్రజలు పోలీసులకు సహకరించి దగ్గరలో వస్తువులు, మెడిసిన్స్ కొనుగోలు చేయాలని అన్నారు. జిల్లాలోని 24 గంటల కాల్ సెంటర్ 9849902379 పనిచేస్తు న్నదని అవసరాలకు సంప్రందించాలని తెలిపారు.  కోవిడ్ -19 వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం ఒక్కటే మార్గమని అన్నారు. కలెక్టర్ పర్యటనలో రుయా సూపరింటెంట్ ఎన్. వి.రమణయ్య, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, తుడా సెక్రటరీ లక్ష్మీ, వైద్య అధికారులు వున్నారు.
 

Related Posts