ఖచ్చితంగా సమాజీక దూరం
సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
అమరావతి మార్చి 28
కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిఆరు. తీసుకున్న నిర్ణయాలు, అమలు అంశాలను సీఎస్ నీలం సాహ్ని సీఎస్ కు వివరించారు. ప్రస్తుతం ఉన్న ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటలవరకూ ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై అధికారులు ప్రస్తావివచారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయా?లేవా? అన్నదానిపై పరిశీలన చేయండని సీఎం అన్నారు. శాస్త్రీయంగా పరిశీలించండి, మ్యాపింగ్ చేయండి. పరిశీలించిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను తీసుకోండి. ప్రజలకు సరిపడా రైతుజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయాన్ని తగ్గించే ఆలోచనలు చేయండని అన్నారు. ఆ ఆలోచన చేసేముందు ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకున్న తర్వాతే పరిశీలనచేసి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాత మాత్రమే సమయం తగ్గించడంపై నిర్ణయాలు తీసుకోండి. ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే వసతులను ఏర్పాటు చేయండి. 14రోజుల క్వారంటైన్కు సిద్ధపడే వారికి అనుమతి ఇవ్వండి. తర్వాత వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించండి. వారిని చాలా బాగా చూసుకోవాలి. ఈ క్యాంపుల్లో కచ్చితంగా ఒక అధికారిని పెట్టండి. ఈ అధికారిని రెసిడెంట్ అధికారిగా నియమించండి. అలాగే రాష్ట్రం వెలుప రాష్ట్రానికి చెందిన కూలీలు, కార్మికుల స్థిగతులను తెలుసుకుని ఎప్పటికప్పుడు స్పందించడానికి రాష్ట్రస్థాయిలో ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని అయన అన్నారు. అలాగే సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన, ఏర్పాటు చేయాల్సిన క్యాంపులు, అక్కడ క్వారంటైన్ సదుపాయాలు, అందులో ఉన్న వారికి భోజన, వసతి సదుపాయాలపైకూడా మరొక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా వీరు మాట్లాడాలి. కొన్ని ఘటనల్లో చాలా నెగెటివ్ ప్రచారం జరిగింది. వారిని బాగా చూసుకోవడలేదనే మాట రాకూడదు. అలాంటివి జరక్కూడదు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్నకళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించి వాటిని శానిటైజ్ చేసి, అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వాలంటీర్ల సర్వే వాలంటీర్లు చేసిన రెండో సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీసారు. జిల్లాల్లో కోవిడ్ –19 నివారణ చర్యలకోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను అందుకోవాలని సీఎం ఆదేశించారు. తమ సర్వే ద్వారా వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు గుర్తించిన వారిని గుర్తించిన డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లి... నిర్దేశించుకున్న ప్రోటోకాల్ ప్రకారం వారికి వైద్యం అందించేలా చేయాలని సీఎం అన్నారు. వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి, కోవిడ్నివారణా చర్యలకోసం హౌస్ సర్జన్ల సేవలు, విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికీ ఒక డాక్టరు కేటాయింపు, వీరిపైన స్పెషలిస్ట్ కేటాయింపు వుండాలని అయన అన్నారు. అలాగే డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కేటాయించాలని సీఎం అన్నారు. ప్రతి యాభై ఇళ్ల తాలూకు పరిస్థితులను ఎప్పటికప్పుడు వాలంటీర్లు నమోదు చేసేలా కంటిన్యూ చేయాలని అన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు. వైద్యులు ఇన్ఫెక్ట్ కాకుండా. వారికి కావాల్సిన ప్రొటెక్షన్ సూట్లు, పరికరాలు అందించాలి. గూడ్స్, నిత్యావసర వస్తువుల వాహనాలను నిలిపేస్తున్నారంటూ ఫీడ్ బ్యాంకు వస్తోంది. వెంటనే దృష్టి పెట్టాలని డీజీపీకి ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వాకు సంబంధించి కరోనా కారణంగా సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టండి. సంబంధిత శాఖాధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. ఉదయం 6 నుంచి 1 గంటవరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో, సామాజిక దూరంతో వారి కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని అయన అన్నారు.