సోమ వారం నాడు యూపీ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఇతరప్రాంతాల్లో దళిత ఉద్యమకారులపై జరిగిన కాల్పులను ఖండిస్తున్నాం.ఆ ఘటనకు పూర్తి బాధ్యత కేంద్రమే వహించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్ చేసారు. దళితులపై కేంద్రప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ రాజకీయ మహాసభల్లో చర్చిస్తాం అని అమె అన్నారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసంపై తమ వైఖరి ప్రకటించకుండా, తెలంగాణలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం 22 జాతీయ మహాసభ సందర్బంగా జరిగిన మతతత్వ రాజకీయాలు జాతీయ సమగ్రత ఫై సెమినార్ కు ముఖ్య అతిధిగా వచ్చిన బృందా కారత్ మాట్లాడుతూ తెలంగాణ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడతాం. ప్రత్యామ్నాయ రాజకీయం వైపు అడుగులు వేస్తామని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రజలును మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారు. వారి ఆగడాలను అంతమొందించే సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికలో బహుజన్ లెఫ్ట్ ప్రాంట్ ప్రజల ముందుకు వస్తున్నామని వెల్లడించారు.