YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

నిత్యావసర సరుకుల ధరలపై హెచ్చరిక  ఏసీపీ  

నిత్యావసర సరుకుల ధరలపై హెచ్చరిక  ఏసీపీ  

నిత్యావసర సరుకుల ధరలపై హెచ్చరిక  ఏసీపీ  
బెల్లంపల్లి  మార్చి 28 
 బెల్లంపల్లి పట్టణంలో నిత్యావసర సరుకులను నిర్ణీత ధరల కంటే  అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు వినియోగదారుల నుండి వస్తున్న సమాచారం మేరకు ఏసీపీ రెహమాన్ హెచ్చరించారు. పోలీసులు ఎప్పుడైనా షాపులపై ఆకస్మిక తనిఖీలు చేస్తామని ఎవరైనా  ఎక్కువ ధరలకు అమ్మినట్లు తెలిసిన ఎడల వారిపై క్రిమినల్ కేసులు నమోదు తో పాటు దుకాణము ను సీజ్ చేసి దుకాణము లైసెన్స్లు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక హోల్ సెల్ వ్యాపారస్తులు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్ కు పాల్పడకుండా నిర్ణీత ధరలకు విక్రయించాలని కనీస నిబంధనలు మూడు ఆడుగుల దూరం ,కొనుగోలు దారులకు డేటాల్ వాటర్ పెట్టడం  వంటి నిబంధనలు   పాటించని వారికి  పోలీస్ శాఖ నుండి హెచ్చరించడమైనది.ఎవరైనా  స్థానిక వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిస్తే  స్థానిక పోలీసువారికి సమాచారం అందించగలరని ప్రజలను కోరారు.  కొందరు బడా  వ్యాపారులు ఇదే అదునుగా వారి  గోదాంలలో నిత్యావసరాల సరుకులను బ్లాక్ చేసి ఇతర గ్రామాలకు సరఫరా చేస్తూ పట్టనవాసులకు అధిక ధరలకు అమ్ముతున్న వారి  గోదాముల పై దాడులు చేసి  ప్రజలకి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని ధరలను అదుపు చేయాలని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Related Posts