YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

కరోనా పై సమరానికి ఎంపీ సోయం సమాయత్తం

కరోనా పై సమరానికి ఎంపీ సోయం సమాయత్తం

కరోనా పై సమరానికి ఎంపీ సోయం సమాయత్తం
ఎంపీ లాడ్స్ నుండి రూ. 60 లక్షలు వితరణ....
ఆదిలాబాద్ మార్చి 28 
 ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోన మహమ్మారిని సంఘటితంగా తరిమికొట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపు రావు పిలుపునిచ్చారు. శనివారం బిజెపి జిల్లా అధ్యక్షుడు పా యల్ శంకర్ తో కలిసి ఆదిలాబాదులోని రైతు బజార్.. పట్టణంలోని పలు మార్కెట్ వీధులను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ను కలిసి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కరుణ పై చేపట్టిన వైద్య సేవలు.. అత్యవసర సేవల వినియోగం... లాక్ డౌన్ .. కర్ఫ్యూ అమలు తీరుపై.. సరిహద్దుల్లో చొరబాట్లు నియంత్రణ గురించి చర్చించారు. ఎంపీ నియోజకవర్గ నిధుల నుండి కరోనా నివారణ కు సామాజిక బాధ్యతగా రూపాయలు 60 లక్షలు అందిస్తున్నట్టు ప్రకటించి కలెక్టర్ దేవసేన కు ఈ మేరకు ప్రోసిడింగ్ అందజేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ కొమరం భీ మ్, జిల్లాలకు రూపాయల 20 లక్షల చొప్పున ఈ నిధులను వెచ్చిస్తున్నట్లు సో యం బాబురావు తెలిపారు. జిల్లాయంత్రాంగం ముఖ్యంగా పోలీసులు.. వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది.. చేపడుతున్న కార్యక్రమాల   సేవల గురించి అభినందించారు. ఈ సందర్భంగా గా రైతు బజార్ లో సందర్శించిన అనంతరo సామాజిక దూరం పాటించకుండా ప్రజలు ఒకచోట గుమిగూడి కూరగాయలు కొనుగోలు చేయడంపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. వేగంగా విస్తరిస్తున్న వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలను జాగృతం కావాలని.. అత్యవసర సమయంలో మాత్రమే మే ఇంటి గడప దాటి బయటకు రావాలని సూచించారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయాన్ని ఎంపీ గుర్తు చేస్తూ సంయమనం పాటించాలని అన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ హెచ్చరించారు. ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే తమను సంప్రదించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉం టానని భరోసా ఇచ్చారు. ఈ మూడు జిల్లాల్లో వైద్య సేవలు ముమ్మరం చేయాలని ఏమైనా అవసరమైతే కేంద్ర మంత్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ గంగ్వార్ , కిషన్ రెడ్డి లను కలిసి ఇబ్బందులు దూరం చేస్తామని అన్నారు. గ్రామాల్లో ముళ్లకంచెలు తీసివేసి జాగ్రత్తలు పట్టించుకోవాలని సూచించారు. నిత్యావసర ధరలు పెరగకుండా జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎంపీ కలెక్టర్ను కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే జాతీయ విపత్తు కింద లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజాన్ కార్యక్రమంలో భాగంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు రేషన్ కార్డు ద్వారా ప్రతి నెల 5 కిలోల చొప్పున గోధుమలు బియ్యం.. ప్రతి కుటుంబానికి ఒక కేజీ పప్పు పంది ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు అందిస్తున్న వేతనాలు 182 నుండి రూపాయలు 202 పెంచడం జరిగింది అన్నారు. మూడు నెలలపాటు ఉ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని ఎంపీ సోయం బాబూరావు వివరించారు. జన్ ధన్ ఖాతా కింద 20 కోట్ల మంది మహిళలకు వచ్చే మూడు నెలల పాటు ఐదు వందల రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఎంపీ వెంట బిజెపి పట్టణ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్.. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts