కరోనాపై పోరుకు గవర్నర్ తమిళి సై విరాళం
హైదరాబాద్ మార్చి 28
కరోనా నియంత్రణ చర్యలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందించారు. సీఎం సహాయ నిధికి తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విరాళం చెక్కును సీఎం కేసీఆర్కు పంపించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనాపై యుద్ధంలో కలిసి నడుస్తానని తమిళి సై తెలిపారు.