YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భారత్ కు అమెరికా కరోనా సాయం

భారత్ కు అమెరికా కరోనా సాయం

భారత్ కు అమెరికా కరోనా సాయం
న్యూఢిల్లీ, మార్చి 28
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం 64 దేశాలకు 174 మిలియన్‌ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు  తెలిపింది. అందులో భాగంగా భారత్‌కు 2.9 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఇది అదనం. అలాగే, వెంటిలేటర్ల అవసరమైన దేశాలకు వాటిని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.ఇటీవల లండన్‌ నుంచి వచ్చిన ఓ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మూడోసారి పరీక్షల్లోనూ పాజిటివ్‌గా వచ్చిందని వైద్యులు వెల్లడించారు. మార్చి తొలివారంలో ముంబయి వచ్చిన ఆమె ఒకరోజు అంతా అక్కడే ఓ ప్రముఖ హోటల్‌లో బస చేశారు. అక్కడ నుంచి తన స్వస్థలం లక్నోకు వెళ్లి అక్కడ పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులతో కలిసి ఆమె పలు పార్టీల్లో సైతం పాల్గొన్నారు. వీరిలో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు కూడా ఉన్నారు.దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, కరోనా పరీక్షల విషయంలో గందరగోళం నెలకునగా.. కేంద్రం దీనిపై శనివారం స్పష్టత నిచ్చింది. గత 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసినవారు, కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసినవారు, తిరిగిన వారు కూడా తప్పక పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. వైద్య విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలని, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, ఇతర తీవ్రమైన వ్యాదులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.దేశంలో కరోనా కేసుల సంఖ్య 900 దాటింది. తాజాగా మహారాష్ట్రలో మరో ఆరుగురికి వైరస్ నిర్ధారణ కాగా, గుజరాత్‌లో ఏడు, మధ్యప్రదేశ్‌లో నాలుగు, తమిళనాడు రెండు, ఉత్తరప్రదేశ్ ఒకటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కోవిడ్-19 నిర్ధారణ అయిన జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. మార్చి 20న మాజీ సీఎం ప్రెస్‌మీట్‌కు హాజరైన జర్నలిస్ట్‌కు అతడి కుమార్తె నుంచి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

Related Posts