YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ
అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.  కరోనా కట్టడి చర్యలపై రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.  కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా మొత్తం 873  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి  19 మంది మరణించారు.  24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వలస కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు చేపడుతున్నాం.   కరోనా చికిత్స కోసం డాక్టర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎయిమ్స్‌ ముందుకొచ్చింది.    ర్యాండమ్‌గా నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య రంగానికి సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాం. కరోనా కేసుల చికిత్స కోసం ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం. కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి చికిత్సపై మార్గదర్శకాలు విడుదల చేశాం. లాక్‌డౌన్‌ పరిస్థితులను రాష్ట్రాల వారీగా సమీక్షిస్తున్నాం.  నిత్యావసరాల సరఫరాకు అనుమతించాలని రాష్ట్రాలకు సూచించాం. రాష్ట్రాల మధ్య సరకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం.  అద్దె కట్టలేక, పలు సమస్యలతో  రాష్ట్రాల్లో ప్రజలు వలస వెళ్తున్నారు.   లాక్‌డౌన్‌, వైద్యపరమైన అంశాలపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో మాట్లాడుతున్నాం. సామాజిక దూరం సరిగా అమలు చేయాలని సూచిస్తున్నామని.  ఆరోగ్యశాఖ పేర్కొంది.

Related Posts