YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 సుప్రీం జడ్జి సాయం

 సుప్రీం జడ్జి సాయం

 సుప్రీం జడ్జి సాయం
న్యూఢిల్లీ, మార్చి 29
గంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా విరాళం ప్రకటించారు. తెలుగు వారైన జస్టిస్ ఎన్వీ రమణ తనవంతు సాయంగా ఈ విరాళం ప్రకటించడం విశేషం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలకు విరాళం ప్రకటించిన తొలి న్యాయమూర్తి ఈయనే. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరి ఒక రూ.లక్ష చొప్పున ప్రకటించారు. మరోవైపు, ప్రధానమంత్రి సహాయ నిధికి కూడా రూ.లక్ష విరాళంగా అందిస్తున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చర్యలకు అందరూ మద్దతుగా నిలబడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. అలాగే కోవిడ్ -19 వ్యాప్తిచెందకుండా ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఎన్వీ రమణ ప్రజలకు సూచించారు. మరోవైపు కరోనాను ఎదుర్కోడానికి విరాళం ప్రకటించిన న్యాయమూర్తుల్లో ప్రథములు.మరోవైపు, తెలంగాణ, ఏపీల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 59 కేసులు నమోదు కాగా, ఏపీలో 13 కేసులు కరోనా అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా రెండో దశలో ఉన్నట్లుగా వైద్యులు చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా సోకినవారు మొత్తం 873 మంది ఉన్నారు. కోలుకున్నవారు 79 మంది కాగా, చనిపోయిన వారు 19 మంది ఉన్నారు.

Related Posts