YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆసియా సంపన్నుల్లో ముఖేష్ అంబానీకి మూడో స్థానం!!

ఆసియా సంపన్నుల్లో ముఖేష్ అంబానీకి మూడో స్థానం!!

ఆసియాలోనే ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ టాప్ 100 జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద దాదాపు 38.3బిలియన్ డాలర్లు. ఇందులో అంబానీతో పాటు మరో నలుగురికి స్థానం దక్కింది. లక్ష్మీ మిట్టల్(51), పల్లోంజీ మిస్త్రీ(61, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ(66),  హెచ్ సీఎల్    ఛైర్మన్ శివ్ నాడార్(85వ స్థానం)లో నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ టాప్ 500 జాబితాలో మొత్తం 24 మంది భారతీయులకు చోటు దక్కింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బిజోస్ దే ఫస్ట్ ప్లేస్. ఆయన సంపద ఈ ఏడాది 21.8బిలియన్ డాలర్లు పెరిగింది. సెకండ్ ప్లేస్ లో  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సంపద ఈ ఏడాది 1.36బిలియన్ డాలర్లు తగ్గింది.

Related Posts