YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో తమ ఆదేశాలపై స్టే విధించే అవకాశమే లేదు

ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో తమ ఆదేశాలపై స్టే విధించే అవకాశమే లేదు

ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో తమ ఆదేశాలపై స్టే విధించే అవకాశమే లేదు తేల్చి చెప్పింన సుప్రీంకోర్టు

ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో తమ ఆదేశాలపై స్టే విధించే అవకాశమే లేదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద బాధితులను విచారణ లేకుండా తక్షణ అరెస్ట్‌ను నిషేధించడంతో పాటు మధ్యంతర జామీను పొందే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పునః పరిశీలించాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను నేడు తక్షణ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై విచారణ జరిపింది. ఈ సందర్బంగా కోర్టు స్పందిస్తూ.. తాము ఎస్సీ, ఎస్టీ చట్టానికి వ్యతిరేకం కాదని, అమాయకులకు శిక్ష పడకూడదన్నదే తమ ఉద్దేశం అని స్పష్టంచేసింది. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నవాళ్లు తమ తీర్పు చదవలేదేమో అని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను రెండు రోజుల్లో చెప్పాలని ఆదేశించింది. పది రోజుల తర్వాత తిరిగి విచారణ జరుపుతామని చెప్పింది.ఎస్సీ, ఎస్టీ చ‌ట్టంలో కీల‌క మార్పుల‌ను సుప్రీం ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ అధికారులు ఈ చ‌ట్టానికి అన‌వ‌స‌రంగా బ‌ల‌వుతున్నార‌ని, సంబంధిత అధికారిని నియ‌మించిన అథారిటీ అనుమ‌తి లేకుండా అరెస్ట్ చేయ‌కూడ‌ద‌ని స్‌ ష్టంచేసింది. ఇక ఎఫ్ఐఆర్ న‌మోదు చేసే ముందే ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపి అది ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కిందికి వ‌చ్చే కేసా కాదా అన్న‌ది చూడాల‌ని కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఇది చ‌ట్టాన్ని బ‌ల‌హీనప‌రిచే చ‌ర్య అంటూ ద‌ళిత సంఘాలు నిర‌స‌న తెలిపాయి. భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇది కాస్తా హింసాత్మ‌కంగా మారి ప‌ది మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వం చ‌ట్టాన్ని మార్చే ఉద్దేశం త‌మకు లేదంటూ సుప్రీంకోర్టు రీవ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.ఈ అంశంపై మరో పది రోజుల తర్వాత విచారణ జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది. ఆందోళన చేస్తున్న వారు తీర్పును సరిగ్గా చదివి ఉండకపోవచ్చని, స్వార్థ ప్రయోజనాల కోసం వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టు పేర్కొంది. తాము చట్టాన్ని ఏ మాత్రం బలహీనపరచట్లేదని, కేవలం అమాయకులను అరెస్ట్‌ల నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.ఎస్సీ, ఎస్టీ వర్గీయులపై వేధింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుల తక్షణ అరెస్ట్ ను నిషేధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆరోపణలు దురుద్దేశంతోగానీ, మరేదైనా కారణంతో చేసినవని ప్రాథమిక దర్యాప్తులో తేలితే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదన్న నిబంధనలు వర్తింవచవని స్పష్టంచేసింది. దీంతో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా జరిగిన బంద్‌లో దాదాపు పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.

Related Posts