YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

ఇండోనేషియా నుంచి దరిద్రులు వచ్చి. కరోనని అందరికి అంటిస్తున్నారు 

ఇండోనేషియా నుంచి దరిద్రులు వచ్చి. కరోనని అందరికి అంటిస్తున్నారు 

ఇండోనేషియా నుంచి దరిద్రులు వచ్చి. కరోనని అందరికి అంటిస్తున్నారు 
ఇండోనేషియా నుంచి దరిద్రులు వచ్చి.. ఇండోనేషియా నుంచి వచ్చిన దరిద్రులతో కరోనా కేసులు పెరిగాయని సీఎం  కెసిఆర్ అన్నారు. తెలంగాణలో కరోనాతో ఎవరూ చనిపోలేదని, అయితే, చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందని తేలందన్నారు. అతడు ఢిల్లీ నుంచి వచ్చాడని తెలిపారు. అతనికి ఇతర రోగాలు ఉండటం, వృద్ధుడు కావడంతో మరణించాడని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్నది కాకుండా తప్పుడు ప్రచారం ఎందుకు అని ప్రశ్నించారు. జాగ్రత్తలు తీసుకుంటాన్న కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే, తక్కువగానే అని అన్నారు.ఏప్రిల్ 7లోగా కరోనా ఫ్రీ తెలంగాణ అవుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కరోనా అంతా కంట్రోల్ లోనే ఉందన్నారు. కొద్ది రోజుల్లో వారి క్వారంటైన్ టైమ్ కూడా ముగుస్తుందన్నారు. అంతా తొందరగా కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు . 60ఏళ్లలోపు రిటైర్డ్ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లను తీసుకుంటామని, రిటైర్డ్ ఆర్మీ వారిని కూడా తీసుకుంటామని తెలిపారు. అవసరానికి తగినట్లుగా వారిని ఉపయోగించుకుని, వారికి డబ్బులు చెల్లిస్తామన్నారు. కరోనా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు నియంత్రణ పాటించాలన్నారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ దొంగలు దొరుకుతారని.. భయంకరంగా శిక్షిస్తామని అన్నారు. అలాంటి దుర్మార్గులకు కరోనా సోకాలని కేసీఆర్ శపించారు.

Related Posts