YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 రంగంలోకి దిగిన భారతీయ రైల్వేలు

 రంగంలోకి దిగిన భారతీయ రైల్వేలు

 రంగంలోకి దిగిన భారతీయ రైల్వేలు
హైద్రాబాద్, మార్చి 30
కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే రంగంలోకి దిగింది. వైద్య పరంగా ఆదుకునేందుకు నడుం బిగించింది. స్లీపర్‌ క్లాస్‌ బోగీలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు దక్షిణమధ్య రైల్వే అధికారులకు ఇచ్చిన అంతర్గత ఆదేశాల మేరకు రీజియన్‌ పరిధిలో కసరత్తు ప్రారంభించింది.సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 640 ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ఉన్నాయి. కరోనా దెబ్బకు  ఏప్రిల్‌ 14 వరకు వీటిని పూర్తిగా ఆపేశారు. ఇవి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌, మౌలాలీ, చర్లపల్లి, లింగంపల్లి, నాందేడ్‌, పూర్ణ రైల్వేయార్డుల్లో నిలిచిపోయాయి. ప్రతి రైలూకు సగటున 12 బోగీలుంటాయి. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌, స్లీపర్‌ చైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ తదితర బోగీలు మినహాయిస్తే ఈ రైళ్లలో దాదాపు 5 వేల వరకు స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారుల అంచనా. దేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే తట్టుకునేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు సమాయత్తమవుతున్నది. కేంద్రం అదేశాల మేరకు విపత్తు నివారణకు రైల్వేశాఖ నడుంబిగించింది. సాంకేతికంగా సాధ్యమైన మేరకు స్లీపర్‌ కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులు దక్షిణమధ్య రైల్వేకు అంతర్గతంగా ఇచ్చిన ఆదేశాల మేరకు రీజియన్‌ పరిధిలో కసరత్తు ప్రారంభించింది.కరోనా వ్యాధి విజృంభిస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మొత్తం బోగీలెన్నీ, ప్రతీ రోజూ ఎన్ని బోగీలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చగలం అనే అంశంపై అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రీజియన్‌ పరిధిలో మెట్టుగూడ, లాలగూడలో వర్క్‌షాపులున్నాయి. నిర్దేశించిన ప్రమాణంలో ఐసోలేషన్‌ కేంద్రాలుగా తయారు చేయడానికి కావల్సిన నైపుణ్యం ఇప్పుడున్న సిబ్బంది వద్ద ఉన్నదా? లేదా? అంశాన్ని సైతం అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలు ఎప్పుడొచ్చినా అందుకు సిద్దంగా ఉండాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు సైతం జారీ చేసినట్టు తెలుస్తున్నది. అలాగే రీజియన్‌ పరిధిలో ఉన్న లాలగూడ, కాజిపేట, నాందేడ్‌ హెల్త్‌ సెంటర్ల వైద్య సిబ్బంది సలహాలు సూచనలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Related Posts