YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన పాటించని జనం  అటకెక్కిన లాక్‌డౌన్... ఎక్కడ చూసినా ప్రజలే... కొరవడిన ఆరోగ్య క్రమశిక్షణ 

ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన పాటించని జనం  అటకెక్కిన లాక్‌డౌన్... ఎక్కడ చూసినా ప్రజలే... కొరవడిన ఆరోగ్య క్రమశిక్షణ 

ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన పాటించని జనం  అటకెక్కిన లాక్‌డౌన్... ఎక్కడ చూసినా ప్రజలే... కొరవడిన ఆరోగ్య క్రమశిక్షణ 
...ప్రధాని ప్రకటన చేసి వారం కూడా కాకుండానే... దేశవ్యాప్తంగా ప్రజలు... ఇళ్లలోంచి బయటకు వచ్చేస్తున్నారు. అసలు లాక్ డౌన్ ఉందా లేదా అన్న డౌట్ రాక మానదు. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 21 రోజులపాటూ... లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో... దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 14తో ఇది పూర్తవుతుందని అంటున్నారు.జనం సోషల్ డిస్టాన్స్ పాటించడం మానేసి... మాకు త్వరగా కావాలంటే, మాకు త్వరగా కావాలంటూ... ఎగబడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వాలే చికెన్ తింటే మంచిదని చెప్పడం, రెండు వారాల తర్వాత చికెన్ షాపులు తెరచుకోవడంతో... ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. లాక్ డౌన్ మొదటి రెండు రోజులు... పోలీసలు ప్రజలపై కఠినంగా వ్యవహరించారు. బయట తిరిగితే లాఠీలకు పని చెప్పారు. ఐతే... పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైపోవడంతో... విమర్శలొచ్చాయి. దాంతో... పోలీసులు నచ్చజెప్పాలే తప్ప... అంత సీరియస్ వద్దని ప్రభుత్వాలు ఆదేశించడంతో... పోలీసులు సైలెంటయ్యారు. అదే అదనుగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక మూడో కారణంగా... సండే కనిపిస్తోంది.  ఐతే...  మొదటిది... నిత్యవసర, అత్యవసర వస్తువులు మున్ముందు దొరకవేమో అన్న ఉద్దేశంతో ప్రజలు... ఇళ్లలోంచి బయటకు వచ్చి... అవసరం లేకపోయినా... అధికంగా సామాన్లు కొనేసుకుంటున్నారు. ఇక రెండోది... ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి... ప్రజలు పెద్ద సంఖ్యలో మాంసం షాపులకు గుంపులుగా వచ్చారు. వారిని కట్టడి చేయడం షాపుల నిర్వాహకుల వల్ల కాలేదు. అదే సమయంలో...అంతేకాదు  ప్రభుత్వాలు ఇస్తున్న రేషన్ సరుకులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందుగానే రేషన్ సరుకులు ఇస్తుండటంతో... తర్వాత తమకు దక్కుతాయో లేదో అన్న టెన్షన్‌తో ప్రజలు... ఒక్కసారిగా రేషన్ సరుకుల కోసంఎగబడుతున్నారు . ఫలితంగా అక్కడ కూడా సామాజిక దూరం మిస్సైంది. అలాగే లాక్ డౌన్ నిబంధనలూ అటకెక్కాయి

Related Posts