అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ
వరంగల్ మార్చి 30
సామాజిక దూరాన్ని పాటించాలని, సానిటైజర్లను వాడాలని, ముఖాలకు దస్తీలు కట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నేడు ఆయన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో కూరగాయల మార్కెట్ ని సందర్శించారు.కూరగాయలు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయా? అని ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు అధిక ధరలకు అమ్ముతున్న ఇద్దరిపై ఫైన్ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక ముందు ఫైన్ కాదు కేసులు కూడా పెట్టాలని కూరగాయల మార్కెట్ లో ధరల పట్టికలు ఉంచాలని, ధరల నియంత్రణ జరగాలని అధికారులను ఆదేశించారు. మంత్రి దయాకర్ రావు తో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా ఉన్నారు.