మంథని మున్సిపాలిటీ లో ఇంటింటికి శానిటైజర్ స్ప్రే
స్వీయ నియంత్రణయే..కరోనా వ్యాధి నివారణ ప్రజలు పోలీసులకు సహకరించాలి.
మంథని మార్చి 30
మంథని మున్సిపాలిటీ పరిధిలో కోవిడ్19 కరోనా వ్యాధి నివారణ కోసం ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా ఇంటింటికి శానిటైజర్ లిక్విడ్ స్ప్రే చేయడం జరిగింది..ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వ్యాధి నివారణ కు స్వీయ నివారణయే మార్గం అని,ప్రజల సహకారమే కరోనా కు మందు లాంటిదని మంథని మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ పుట్ట శైలజ అన్నారు..ప్రజలు పోలీసులకు సహకరించాలని,ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని అన్నారు..మంథని మున్సిపాలిటీ కి అడుగగానే సహకరించిన అగ్ని మాపక సిబ్బందికి కృతజ్ఞతాభినందన తెలియజేస్తున్నట్లు తెలిపారు..ఇటువంటి విపత్తు సమయంలో సహకరిస్తున్న పారిశుధ్య కార్మికులకు,ఆశా వర్కర్లకు, డాక్టర్లకు,రెవిన్యూ,వ్యవసాయ అధికారులకు,ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నట్లు అన్నారు.