కరోనా వైరస్ ధాటికి కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ
ఒక రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య
న్యూఢిల్లీ మార్చ్ 30
కరోనా వైరస్ ధాటికి కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మనీ లోని హెస్సీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్ షాఫెర్ గత కొద్ది రోజులుగా గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు.అయితే అతనికి కనుచూపు మేరలో పరిష్కారాలు కనిపించలేదు. 54 సంవత్సరాల రైల్వే ట్రాక్ సమీపంలో శనివారం చనిపోయి కనిపించారు. కరోనా ధాటికి పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో అని తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు ఆ రాష్ట్ర ప్రీమియర్ వోల్కర్ బౌఫియర్ తెలిపారు.ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తాము భావిస్తున్నామని వైస్బాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయం ధృవీకరించింది. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్ఫర్ట్ హెస్సీ రాష్ట్రంలోనే ఉంది. అక్కడ డ్యూయిష్ బ్యాంకు, కమెర్జ్ బ్యాంకుతో సహా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు లాంటి ప్రధాన బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.