కరోనాని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాము ప్రజల సహకారంతో కరోనాని నివారించడం పెద్ద కష్టతరం కాదు
ఉరవకొండ లో పర్యటించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి
ఉరవకొండ మార్చ్ 30
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాగలిగామని, సామాజిక దూరాన్ని ఎవరికి వారు స్వచ్ఛoధ నియంత్రణ చర్యలు తీసుకోవాలని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం ఉరవకొండ పట్టణంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పర్యవేక్షించిన రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మాలగూండ్ల శంకరనారాయణ గారు, ఉరవకొండ మాజి శాసన సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు కఠినమైన కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్ రాష్ట్ర ప్రజా రవాణా పై ప్రజల్లో అవగాహన కలుగ చెయ్యాల్సి ఉందన్నారు. అందులో భాగంగా వాస్తవ పరిస్థితులను వివరించి, తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రజల్లోకి భయాందోళనలను దూరం చెయ్యడం ముఖ్య మన్నారు. లాక్ డౌన్ అమలుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రసార సాధనాలు ద్వారా ప్రజల్లోకి సామాజిక బాధ్యతగా తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు చేపడ్డం ద్వారా ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాగలిగామన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టం గా అమల్లోకి తీసుకుని వొచ్చమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే నియంత్రణ లోని తీసుకుని రాగలుగుతామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న మనవారికి తగిన షెల్టర్ , ఇతర సదుపాయాలు కల్పించాలని కోరడం జరుగుతున్నదని తెలిపారు. అదేవిధంగా అఇతర రాష్ట్రాలకు చెందిన వారికి తగిన విధంగా షెల్టర్ కల్పించాలని కలెక్టర్ లను, ఎస్పీ లకు స్పష్టం చేశామన్నారు. నిత్యవసర సామగ్రి, అత్యవసర సేవలు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తీసుకోవడం జరుగుతున్న దని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని నివారణకు సామాజిక దూరం ఏకైక మార్గమని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సహకారాన్ని అందించాల్సి ఉందన్నారు. ఇటలీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, మనకి మనమే స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల రవాణా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం, వాటిని కోల్డ్ స్టోరేజ్ గురించి ప్రభుత్వం దృష్టి పెట్టిందని. ఆక్వా సాగు, చేపలు, హార్టికల్చర్, పట్టు పరిశ్రమ పంటల ద్వారా వొచ్చినా ఉత్పత్తులకు తగిన కోల్డ్ స్టోరేజ్, ఎగుమతులపై దృష్టి పెట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుటుందని తెలిపారు. వారికి చేదోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ఆదిశలో జిల్లా కలెక్టర్ మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం తప్పనిసరి గా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. అలాగే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా నిత్యావసర వస్తువులు మరియు కూరగాయల ధరలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. తరచుగా తనిఖీలు చేయడంవల్ల ధరల నియంత్రణ సాధ్యమౌతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.