YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పక్కా ప్లానింగ్ ఉంటే..లెక్క అదిరిపోతుంది..

 పక్కా ప్లానింగ్ ఉంటే..లెక్క అదిరిపోతుంది..

 పవన్‌ కల్యాణ్‌ ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారనీ, ఆచరణ విషయంలో కొంత తడబడతారన్న విమర్శ గతంలో వినిపించేది. రాజకీయంగా యాక్టివ్ గా మారినా ఆయన ఈ విమర్శ నుంచి బయటపడలేకపోతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన మంచి ప్లానింగ్ తో ముందడుగేస్తే.. తెలుగు నాట ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దగలరు. సరికొత్త రాజకీయాన్ని ప్రజలకు అనుభవంలోకి తీసుకురాగలరు. పదవీ వ్యామోహంపై కంటే ప్రజలకు సుపరిపాలన అందించాలన్న బేసిక్ పాలిటీని విస్తృతం చేయగలరు. 

పొలిటికల్ గా పవన్ ఇంకా రాటుదేలాల్సి ఉంది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంది. ట్రాన్స్ పరెన్సీ అంటూ.. మనసులో ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తూ ఆయన కొంత ఇరకాటంలో పడుతున్నారు. జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాలన్నదే ఆయన టార్గెట్. అలాంటప్పుడు.. పెద్ద ఎత్తున ప్రజామద్దతు కూడగట్టుకోవాలి. అలా జరగాలంటే ఆవేశంతో కాక ఆలోచనతో మాట్లాడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

ప్రజాభిప్రాయాన్ని ప్రతిబించేలా రాజకీయ నేత వ్యవహారశైలి ఉండాలి. అయితే ఇలాంటి డబుల్ రోల్ తనవల్ల కాదంటూ పవన్ భోళాగా మాట్లాడేస్తున్నారు. ఇదే ఆయన్ను ఇరకాటంలో పడేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ప్యాకేజీల పైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ తరహా కార్యక్రమాలకు పవన్ కొంత దూరంగా ఉంటే జనసేనకు ప్లస్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో థర్డ్ పార్టీ ఇమేజ్ ను సొంతం చేసుకుంది జనసేన.. ఈ ఇమేజ్ పెరగాలంటే పవన్ కల్యాణ్ సమర్ధవంతమైన రాజకీయం నెరపాల్సిందే. అభిమానులు, కొత్త రాజకీయం కోరుకుంటున్న వారి మద్దతు పవన్ కు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే.. ఆయన ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తేనే రిజల్ట్ బాగుంటుంది. చిన్న అంశమైనా మాగ్జిమమ్ బెనిఫిట్స్ పొందేందుకు ప్రతీ రాజకీయ పార్టీ ట్రై చేస్తుంది. ప్రజలకు టచ్ లోనే ఉండేలాప్లాన్ చేసుకుంటుంది. జనసేన సైతం ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తే ఆ పార్టీకి తిరుగుండదు.

Related Posts