పేద ప్రజలను ఆదుకొండి
హైదరాబాద్ మార్చ్ 30 (న్యూస్ పల్స్)కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గం లోని మూసాపేట్, అల్లాపూర్ డివిజన్లలో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది తో కలిసి సోడియం హైపోక్లోరైట్ ఉపయోగించి కాలనీలలో తానే స్వయంగా స్ప్రే చేసారు. కాలనీలలో ని ప్రజలు లు కరోనా వైరస్ ని అరికట్టాలని చెబుతూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత తో పాటుగా కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, సభీహా గౌసుద్దిన్ పాల్గొన్నారు కూకట్ పల్లి నియోజకవర్గం లోని అన్ని డివిజన్ల కార్పొరేటర్ లతో పాటుగా జోనల్ కమిషనర్ మమత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా కరోనా నివారించుటకై పలు కార్యక్రమాలు చేస్తున్నారు. లాక్ డౌన్ చేయడంవల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆహారం దొరకక ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులతో పాటుగా డబ్బులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. అది కాకుండా కూకట్ పల్లి నియోజకవర్గంలోని తెల్ల రేషన్ కార్డు లేని నిరుపేద ప్రజలకు, మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా పలు రాష్ట్రాల నుండి వచ్చి కూలీలుగా పని చేస్తున్న కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వాలని కార్పొరేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా తన వంతు సాయంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ కు వంద బస్తాల బియ్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ మీకు తోచిన సహాయం చేయాలని, మీతో పాటుగా నాయకులు, కార్యకర్తలు, కాలనీల్లో అన్ని అసోసియేషన్లు అందరూ ముందుకు వచ్చి పేద ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.