YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

కరోనా ఎఫెక్ట్ తో ఆలయాల మూసివేత

కరోనా ఎఫెక్ట్ తో ఆలయాల మూసివేత

కరోనా ఎఫెక్ట్ తో ఆలయాల మూసివేత
హైద్రాబాద్, మార్చి 30 
కరోనా వైరస్ కారణంగా భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మాల్స్, మార్కెట్ లు, ఇతర వినోద ప్రదేశాలు మూత పడ్డాయి. ఈ జాబితాలో భారత దేశంలో ప్రసిద్ధ ఆలయాల నుండి చిన్న ఆలయాల వరకు కూడా ఉన్నాయి. వీటిని మూసివేయకపోయినా భక్తులకు ప్రవేశాన్ని మాత్రం పూర్తిగా నిషేధించారు. పండుగ సీజన్ కావడంతో ఆలయాలపై ఈ ప్రభావం అధికంగా పడింది. ఆలయాల దర్శనానికి అనుమతి లేకపోవడం భక్తులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తీర్ధయాత్రల కోసం ముందే ప్లాన్ చేసుకున్న వారంతా తమ యాత్రలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకీ కరోనా ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొంటున్న భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.దేశంలో అత్యంత ప్రసిద్ధ తీర్ధ యాత్రల్లో వైష్ణో దేవి యాత్ర ప్రముఖమైనది. ఇక్కడ చైత్ర నవరాత్రి, శరద్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఆలయ పరిపాలన విభాగం మార్చి 25 నుండి ప్రారంభమైన చైత్ర నవరాత్రి ఉత్సవానికి దాదాపు వారం రోజుల ముందే వైష్ణోదేవి యాత్రను రద్దు చేసింది. ఈ ఆలయానికి ఏటా లక్షలాది సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో వైష్ణో దేవి గుహాలయం ఒకటి.వింధ్య వాసిని, మహాకాళి, అష్టభుజ మహాసరస్వతి దేవతలకు వింధ్యాచల్ నిలయం. ఎంతో శక్తివంతమైన ఈ దేవతల ఆలయాలు భౌగోళికంగా త్రిభుజాకారంలో ఉంటాయి. వింధ్యాచల్ యొక్క శక్తి పీఠానికి అసమానమైన శక్తి ఉందని అనేక పవిత్ర గ్రంధాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఈ ఆలయం భక్తులకు అనుమతి లేకుండా మూసి వేయడం చాలా సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని పండితులు చెబుతున్నారు.భారత దేశంలో అత్యంత పురాతన నగరం వారణాసి. హిందూ మత కేంద్రంగా విరాజిల్లే ఈ నగరంలో భక్తుల తాకిడి లేని రోజంటూ ఉండదు. కానీ కరోనావైరస్ కారణంగా వారణాసి కూడా భక్తులు లేక వెలవెలబోతుంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఇక్కడ గంగా హారతిని నిర్వహించడం వేల సంవత్సరాల నుండి ఆనవాయిగా వస్తోంది. భక్తులు ఈ హారతి కార్యక్రమాన్ని చూసి పరవశం పొందుతుంటారు. కానీ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఈ హారతి కార్యక్రమాన్ని వీక్షించకుండా వారణాసి జిల్లా పరిపాలన విభాగం నిషేధం విధించింది. అదే విధంగా వారణాసిలోని ప్రసిద్ధ దేవాలయాలైన కాశీ విశ్వనాథ్ ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం, సంకట్ మోచన్ హనుమాన్ మందిరం వంటి అనేక ఆలయాల్లో భక్తుల ప్రవేశానికి అనుమతి లేకుండా నిషేధం విధించారు.శ్రీకృష్ణున్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న ప్రదేశాల్లో ఇస్కాన్ దేవాలయాలు ఒకటి. లాక్ డౌన్ నేపధ్యంలో వృందావన్, నోయిడా సహా దేశంలోని అనేక నగరాల్లో ఉన్న ఇస్కాన్ దేవాలయాలకు భక్తులను రాకను నిషేధించారు. భారత దేశంలో కృష్ణ ఆరాధకులకు బలమైన కేంద్రంగా ఉన్నందున ఇస్కాన్ దేవాలయాలకు ప్రతి నిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాబట్టి కరోనావైరస్ పూర్తి నియంత్రణలోకి వచ్చిన తరువాతే దేశవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలను భక్తుల కోసం తెరవాలని అధికారులు నిర్ణయించారు.దేశంలోని ప్రసిద్ధ వినాయక ఆలయాల్లో ముంబై సిద్ధి వినాయక్ ఆలయం ఒకటి. ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. అందుకే ఇక్కడికి ప్రతి రోజూ వేలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కరోనావైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ట్రస్ట్ కొన్ని నిబంధనలతో భక్తులను అనుమతించినప్పటికీ మార్చి 16 తరువాత భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. కరోనావైరస్ పూర్తి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే ఈ ఆలయాన్ని తెరవనున్నారు.కరోనావైరస్ నివారణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేసిన తరువాత పూరీ జగన్నాధ్ ఆలయ అధికారులు కూడా ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. భారత దేశంలోని చార్ ధామ్ లలో ఒకటైన పూరీ జగన్నాధ్ ఆలయం ఏకాదశి మరియు ఇతర పండుగ సందర్భాల్లో పూర్తిగా భక్తులతో నిండిపోతుంది.భారత దేశంలో అత్యధిక ఆదాయం, అత్యధిక భక్తుల తాకిడి గల దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనది. ఈ ఆలయానికి ప్రతి రోజూ భక్తుల నుండి రూ. కోట్లలో ఆదాయం వస్తుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తిరుమలకు కూడా భక్తుల రాకను నిషేధించడంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పడిపోయింది. చాలా సంవత్సరాలలో ఇలా జరగడం ఇదే మొదటిసారని పండితులు చెబుతున్నారు. కరోనావైరస్ లక్షణాలతో ఒక వృద్ధ భక్తుడు తిరుమల వద్ద కుప్పకూలిన సంఘటన తరువాత ఆలయంలో ఈ కఠిన చర్యలు అమలు పరుస్తున్నారుప్రపంచ ప్రఖ్యాతి చెందిన కామాఖ్య దేవి ఆలయం కూడా ఈ జాబితాలో చేరింది. ఈ ఆలయాన్ని దర్శించేందుకు భారత దేశం మరియు విదేశాల నుండి చాలా మంది సందర్శకులు వస్తుంటారు. కాబట్టి కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఈ ఆలయాన్ని కూడా మూసివేయాలని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ పూర్తయిన తరువాత కామాఖ్య ఆలయం తెరుచుకునే అవకాశం ఉంది.

Related Posts