మహారాష్ట్ర, గుజరాత్ లలో తీవ్రమవుతున్న మరణాలు
న్యూఢిల్లీ, మార్చి 30
మహారాష్ట్రలో తొమ్మిదో కరోనా మరణం నమోదైంది. పుణేలో 52 ఏళ్ల ఓ వ్యక్తి కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. పుణేలో నమోదైన తొలి కరోనా మరణం ఇదని నగర మేయర్ మోహోల్ తెలిపారు. అతడి క్లోజ్ కాంటాక్ట్‌లను నగరంలోని ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారన్నారు. చనిపోయిన వ్యక్తికి డయాబెటిస్, బీపీ సమస్యలు ఉన్నాయన్నారు. మహారాష్ట్రలో కొత్తగా 12 మందికి కోవిడ్ సోకినట్లు తేల్చగా.. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 215కు చేరింది. మహారాష్ట్రంలోని సంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది కరోనా పాజిటివ్ అని తేలింది.మరోవైపు గుజరాత్‌లోనూ 45 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోయింది. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ఆరుకు చేరింది. గుజరాత్‌లో 69 మంది మాత్రమే కోవిడ్ బారిన పడినప్పటికీ ఆరుగురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగా గుజరాత్‌లోనే నమోదు అవుతోంది.అహ్మదాబాద్‌లో ముగ్గురు కరోనా కారణంగా చనిపోగా.. భావ్‌నగర్‌లో ఇద్దరు, సూరత్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. భావ్‌నగర్‌లో ఆరుగురికి కరోనా సోకగా ఇప్పటి వరకూ ఇద్దరు చనిపోయారు. డయాబెటిస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్లే గుజరాత్‌లో ఎక్కువ మంది చనిపోయారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.బెంగాల్‌లోనూ ఓ మహిళ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. దీంతో బెంగాల్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది.