నారా లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు. ఈ క్వాలిటీ చాలు.. సర్కార్ లో కీ రోల్ పోషించడానికి. అయితే కెరీర్ లో 'సీఎం కుమారుడు' అనే ట్యాగ్ వద్దనుకున్నారు లోకేశ్. స్వయంకృషితో పైకి రావాలనుకున్నారు. ఆ మేరకే టార్గెట్స్ నిర్దేశించుకుని శ్రమించారు. టీడీపీలో కీలక బాధ్యతలు, మంత్రి పదవి.. లోకేశ్ ఆశించినవి కావు. ఆయన కష్టానికి దక్కిన కానుకలు. శ్రమను గుర్తించి గౌరవించాలన్న తమ అతి సాధారణ నైజానికి అనుగుణంగానే టీడీపీ ఆయనకు ఈ పదవి అప్పగించింది. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను వినమ్రతతో స్వీకరించిన లోకేశ్ కష్టించి పనిచేసే తత్త్వాన్ని మాత్రం వదలలేదు. మంత్రిగా ఏడాది గడిచినా విధుల నుంచి విశ్రాంతి కోరుకోవడంలేదు. శాయశక్తులా కృషి చేసి ప్రజాభ్యున్నతికి పాటుపడాలని తపిస్తున్నారు. దానికి తగ్గట్లే విధానాలు రూపొందించుకుంటున్నారు. కార్యకర్త స్థాయి నుంచి మంత్రిగా మారడంలో.. లోకేశ్ పనితీరును పరిశీలిస్తే.. ఆయన అత్యంత సామాన్యుడిలానే కష్టపడ్డారన్న విషయం ఈజీగానే అర్ధమవుతుంది. తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకేమీ అగ్రతాంబూలం లభించలేదు. స్వయం కృషితోనే అంతా సాధించుకున్నారు. పార్టీలో తనకంటూ ప్రత్యేకతనే కాక అపార గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఓ కార్యకర్తగా ఇతర కార్యకర్తలు గురించి ఆలోచించారు. అందుకే పార్టీని నమ్మకున్న కార్యకర్తలందరి కోసం సంక్షేమ నిధి ఏర్పాటు అయ్యేలా కృషిచేశారు.
అత్యంత సామాన్యుడిలా పనిచేయడంవల్లే కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఉండాలన్న ఆలోచన లోకేశ్ కు కలిగింది. వాస్తవానికి ఆయన పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టిన నాటి నుంచీ తన బ్యాక్ గ్రౌండ్ మరచిపోయారు. పార్టీ అధినేత కుమారుడిగా కాక సామాన్య వ్యక్తిగానే టీడీపీ కోసం శ్రమించారు. కార్యకర్తగా మారి పాఠాలు నేర్చుకున్నారు. నాయకత్వ లక్షణాలకు పదును పెట్టుకున్నారు. 2009-2014 ఎన్నికల్లో టీడీపీ కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. సిసలైన సామాన్యుడిగా ఆలోచించి పార్టీ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారో అగ్ర నాయకత్వానికి నివేదించారు. ఏ పథకాలైతే ప్రజాసంక్షేమానికి దన్నుగా ఉండగలవన్న అంశాలపై విస్తృత కసరత్తు చేశారు. నిత్యం నేతలతోనే కాక కార్యకర్తలు, సామాన్యులతో టచ్ లో ఉంటూ పార్టీ విధానాలు ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకున్నారు. ప్రజాభ్యున్నతే పరమావధిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపే స్కీమ్ లకు ప్లాన్ చేశారు. నిత్య విద్యార్ధి లోకేశ్. రాజకీయాల్లోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ప్రతీ విషయాన్ని నేర్చుకుంటూ తనను తాను నిరూపించుకుంటున్నారు. ఉన్నత విద్యావంతుడైన ఈ యువనేత చక్కటి విజన్స్ తో ముందడుగేస్తున్నారు.