YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*సంస్కారం*

*సంస్కారం*

*సంస్కారం*
మన వేదాంతమంతా రెండు పదాల చుట్టూ తిరుగుతుంది.
ఒకటి మమకారం, రెండోది అహంకారం.
ఈ రెండూ మనిషి చుట్టూ చేరడమే సంసారం.
దీన్నే మాయ అని పిలిచారు.
ఆ మాయ ఏడుస్తున్న చంటి పిల్లాడిలాంటిది. చంకలోకి ఎక్కదు. క్రింద నిలబడదు.
ఈ మాయారూపమైన అహంకారం మనిషి నుంచి దూరమైతే అతనిలో వ్యక్తమయ్యేది ఓంకారమే.
అహంకారాన్ని అణచివేసే శక్తి ఓంకారానికి ఉంది. ఓంకారం పరమాత్మ స్వరూపంగా చెప్పబడింది.
ఈ రెండింటిలో ఏదైనా ఒక దానికే మనలో స్థానం ఉంది. అహంకారమనే మాయా సంసారం దాటాలంటే సంస్కారం కావాలి. అది మనిషిని ప్రభావితం చేసినప్పుడు అహంకారం దూరం అవుతుంది.రెండు రూపాయల విలువ చేసే ఇనుముకు సంస్కరిస్తే వందల రూపాయల విలువ చేసే వస్తువుగా మారుతుంది. ఖర్చు లేకుండా పొందేది సంస్కారం.
*సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే*
*కావ్యామృత రసాస్వాదః సంగమస్సజ్జనైస్సహ*
సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు కాస్తుంటాయి.
మొదటిది కావ్యామృత రసాపానం, రెండోది సజ్జనుల సాంగత్యం అని హితోపదేశం తెలిపింది.
అత్యద్భుత జ్ఞాన సముద్రాన్ని అందించిన రుషులకు కృతజ్ఞత తెలిపి, రుషి రుణం తీర్చుకోవడానికి గ్రంథపఠనం చేయాలి. ఆ గ్రంథాల సారాంశాన్ని మనసు నిండా నింపుకోవాలి.
 *జై శ్రీమన్నారాయణ*
వరకాల  మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts