రాష్ట్రంలో మొక్కజొన్న,జొన్న ధరలు పూర్తిగా పడిపోయాయి. మార్కెట్ ధరకు ఈ రెండు పంటలను 200కోట్లతో రైతుల నుండి కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. 2014 మే 16నాడే ఎన్నికలలో గెలిచి బిజెపి ని కలిసిన పార్టీ వైసిపి అని అయన వ్యాఖ్యానించారు. అప్పటికి మోడీ ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యలేదు. ఎమ్మెల్యేలను ఎవరికి తెలియకుండా, 9మంది ఎంపిలను తీసుకొని వెళ్ళి మోడీని జగన్ కలిసారని అన్నారు. జగన్ మీదా ఉన్న కేసుల కోసం అప్పటి నుండే మోడీ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్, త్రైత సిద్దాంతం పాటిస్తున్నారు. అబద్దాలు, సియం పదవి, కేసులు రద్దు కోసం జగన్ త్రైత సిద్ధాంతం పాటిస్తున్నారని అయన విమర్శించారు. అసెంబ్లీకి వస్తే మా ధాటికి తట్టుకోలేక జగన్ పరారైయ్యారని అయన అన్నారు. జగన్ ప్రభుత్వాని ప్రశ్నించాలంటే దమ్ము ఉంటే వైసిపి 6వతేదీ లోపు అసెంబ్లీ కి రావాలని డిమాండ్ చేసారు.