YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జర్నలిస్టుల అక్రెడిటేషన్ రద్దుపై వెనక్కి తగ్గిన కేంద్రం!!

జర్నలిస్టుల అక్రెడిటేషన్ రద్దుపై వెనక్కి తగ్గిన కేంద్రం!!

నకిలీ వార్తలు రాసిన  విలేకరి గుర్తింపు రద్దు చేస్తామంటూ జారీ చేసిన మార్గదర్శకాలను కేంద్రం ఉసంహరించుకుంది. వివాదాస్పద మార్గదర్శకాలను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించడంతో ఆ శాఖ వాటిని రద్దు చేసింది. ఏదైనా ఒక వార్త నకిలీది అని ఫిర్యాదు వస్తే వాటిని ప్రింట్ మీడియా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎలక్ట్రానిక్ మీడియా అయితే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్కు రిఫర్ చేస్తామని పేర్కొంది. ఆ  సంస్థలు 15 రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తి చేస్తాయని, ఆ వార్త  తప్పని తేలితే చర్యలు ఉంటాయని చెప్పింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే ఆరు నెలలు, రెండోసారి మళ్లీ ఫేక్ న్యూస్ రాస్తే ఏడాది పాటు, మూడవసారి ఉల్లంఘన అయితే శాశ్వతంగా అక్రెడిటేషన్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

ఈ వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయన తప్పుపట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సందర్భంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని సీఎం గుర్తు చేశారు. 

Related Posts