YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 తెలుగు రాష్ట్రాలను ముంచిన ఢిల్లీ ప్రార్ధనలు

 తెలుగు రాష్ట్రాలను ముంచిన ఢిల్లీ ప్రార్ధనలు

 తెలుగు రాష్ట్రాలను ముంచిన ఢిల్లీ ప్రార్ధనలు
హైద్రాబాద్, మార్చి 31
ఢిల్లీ లోని మర్కజ్ లో జరిగిన ప్రార్థనల్లో మొత్తం 280 మంది పాల్గొన్నట్లు గా అధికారులు గుర్తించారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వీళ్లలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మర్కాజ్ లో ప్రార్థనలు చేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న దానిపైన మిస్టరీ కొనసాగుతోంది. మిగతా వారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కాజ్ ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనలకు ప్రపంచ దేశాల నుంచి చాలా మంది హాజరయ్యారు. దాదాపు 75 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రార్థనలకు వేలాది మంది హాజరయ్యారు. ఈ ప్రార్థన ల కోసం తెలంగాణ నుంచి మొత్తం 280 మంది హాజరైనట్లు ఇప్పటివరకు అధికార వర్గాలు చెబుతున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్ నుంచే 186 మంది పాల్గొన్నట్లు అధికారులు తేల్చారు. ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారు ఆరుగురు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.అదే మాదిరిగా అదిలాబాద్ నుంచి 10, నిజామాబాద్ నుంచి 18, మెదక్ నుంచి 26 ,రంగారెడ్డి జిల్లా నుంచి 15 ,మహబూబ్ నగర్ జిల్లా నుంచి 25 ,నల్గొండ జిల్లా నుంచి 21, ఖమ్మం జిల్లా నుంచి 15, వరంగల్ నుంచి 25 ,కరీంనగర్ నుంచి 17 ,నుంచి 11 ,నిర్మల్ నుంచి 11 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు . ఈ ప్రార్థనల్లో పాల్గొన్న చాలామంది కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఢిల్లీ లోని ప్రార్థన మందిరం సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో వృద్ధుడు చేరాడు. నాంపల్లి కి చెందిన వృద్ధుడు మర్కాజ్ ప్రార్థన చేసి తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది . దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు కరోనా తో చనిపోయినట్లుగా తేలింది. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.ప్రార్థన కోసం ఎవరైతే ఢిల్లీ వెళ్లారో వాళ్ళని వెతికి పట్టుకునే పనిలో పడింది. ఒకవైపు ట్రాకింగ్ చేస్తున్న సమయంలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో పాతబస్తీకి చెందిన ఒక జర్నలిస్ట్ తో పాటు మహిళ కూడా మరణించారు. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం 280 మందిని అధికారులు గుర్తించారు. వీళ్ళని వెతికి పట్టుకునే పనిలో అధికార యంత్రాంగం ఉంది. వీళ్ళు ఎంతమందికి కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఐసొలేషన్ కు తరలించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఇక ఏపీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది.ఢిల్లీలో జరిగిన మతప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 500 మంది పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వీరిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఎక్కువగా ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఎక్కువ గా ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. వీరిలో 200 మందిని మాత్రమే ఇప్పటి వరకూ కనుగొని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ లో ఉంచారు. మిగిలిన వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.

Related Posts