YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రార్ధనల టెన్షన్ ఒక్కొక్కరిని వెతికేపనిలో కేసీఆర్, జగన్

తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రార్ధనల టెన్షన్ ఒక్కొక్కరిని వెతికేపనిలో కేసీఆర్, జగన్

తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రార్ధనల టెన్షన్
ఒక్కొక్కరిని వెతికేపనిలో కేసీఆర్, జగన్
విజయవాడ, హైద్రాబాద్, మార్చి 31
తెలుగు రాష్ట్రాలను కరోనా పరేషాన్ వెంటాడుతోంది. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోవడం టెన్షన్ పెడుతోంది. ఈ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. 2 వేల మంది భారతీయులు ఈ ప్రార్థనల్లో పాల్గొనగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో.. అక్కడికి వెళ్లొచ్చిన వారిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొందర్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ప్రధానంగా ఏపీలో నాలుగు జిల్లాల్లో ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఏపీలో తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులు ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు బయటపడ్డాయి.. వీరిలో ఇద్దరు ఢిల్లీ వెళ్లొచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉంది. దీంతో అధికారులు ఈ పాజిటివ్ కేసులు ఉన్న వ్యక్తులతో తిరిగినవారిపై ఫోకస్ పెట్టారు. వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఇద్దరు ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎవర్ని కలిశారో ఆరా తీసే పనిలో ఉన్నారు. అలాగే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో శానిటేషన్ చేపట్టారు.. ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు.. వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.ఇక గుంటూరు జిల్లాలో కూడా పలువురు ఢిల్లీ వెళ్లి వచ్చినవారు ఉన్నారు. జిల్లాలో నమోదైన మొదటి కేసు గుంటూరుకు చెందిన వ్యక్తిది.. ఈయన ఓ ప్రజా ప్రతినిధికి బంధువు. ఈయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత స్థానికులకు విందు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విందుకు ఆ ప్రజా ప్రతినిధి హాజరయ్యారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి తన బంధువేనని కాకపోతే ఢిల్లీ వెళ్లొచ్చిన సంగతి తనకు తెలియదన్నారు. అంతేకాదు ఆయన కూడా ఫ్యామిలీతో సహా ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇక పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతంలో అధికారులు శానిటేషన్ చేపట్టారు. చుట్టు పక్కల కాలనీల్లో కూడా ప్రజల్ని అమ్రమత్తం చేశారు. అంతేకాదు మాచర్ల ప్రాంతంలో కూడా కొందరు ఢిల్లీ వెళ్లొచ్చారని తెలియడంతో వారిని గుంటూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.ఇక ప్రకాశం జిల్లా చీరాలలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. ఇద్దరు చీరాల కరోనా బాధితులు 280 మందితో కూడిన బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్‌, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం వారికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని.. వీరి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మిగతా 80 మందిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన బృందంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు బయటపడటం వీరి వెంట అధిక సంఖ్యలో జనాలు ఉండటం ఆందోళనరేపుతోంది.ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఢిల్లీ ట్రావెల్ హిస్టరీ ఉన్నవారిపై ఫోకస్ పెట్టారు. ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువమంది వివరాలు సేకరించారు.. మిగిలిన వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. పాజిటివ్ ఉన్నవారితో సన్నిహితంగా మెలిగినవారిపై ఫోకస్ పెట్టారు. ఇటు ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్ని కూడా తమ ఆదీనంలోకి తీసుకుంది. ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తోంది.. జిల్లాలు, నియోజకవర్గాలవారీగా బెడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Related Posts