వేటగాళ్లు... స్మగ్లర్లతోనే ముప్పు...
అదిలాబాద్, మార్చి 31
పులులు మానవ సంస్కృతులకు స్ఫూర్తినిస్తాయి. అవి వేటాడతాయనే సరికి మాత్రం చిక్కులు మొదలయ్యాయి. పెద్దదైన ఈ ప్రాణి చాలా ప్రాంతాల్లో అంతరించింది. పులులకు ఆశ్రయంగా, వాటి ఆహార జంతువులకు మేతగా ఉపకరించే అటవీ ఉత్పత్తులను అంతమొందించడం దీనికి ఒక కారణమని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వృక్షాలు నరకడం మూలంగా అడవులు పలుచబడ్డాయి. వీటిలో క్రూర మృగాల సంచారం చాలా తక్కువగా ఉంటుంది. వాటికవీ మనుగడ సాధించలేక ఇతర ప్రాంతాలను చూసుకునే క్రమంలో జనారణ్యంలోకి వస్తుండటం గమనార్హం. కామారెడ్డి జిల్లాలోని అటవీ భూముల కబ్జా లు, చెట్ల నరికివేతలతో విస్తీర్ణం తగ్గుతోంది. ఈ మధ్యే వెల్లడైన గణాంకాల ప్రకారం బాన్సువాడ రేంజ్‌లో 800 ఎకరాలు, ఎల్లారెడ్డి రేంజ్‌లో 47.5 ఎకరాలు, కామారెడ్డి రేంజ్‌లో 247.25 ఎకరాలు, గాంధారి రేంజ్‌లో 703.65 ఎకరాల మేర అటవీ ప్రాంతం నామరూపాల్లేకుండా పోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కలప స్మగ్లర్లకు తోడుగా వేటగాళ్ల ఆటవిక చర్యలు సైతం అడవిని విధ్వంసానికి గురి చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన అధికారులు వైఫల్యం చెందడంతో మూగ జీవాలకు ముప్పు తప్పడం లేదు. సర్కారు అందిస్తోన్న హరిత స్ఫూ ర్తితో అటవీ శాఖ అధికారులు ముందుకు కదిలి జంతుజాలం రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వేలాది సంవత్సరాలుగా మానవ సంస్కృతులలో పులులు, చిరుతలను ఆదరించారు. ఎంతగానో ఆరాధించారు. హానికరమంటూ వాటిని మట్టుబెట్టారు. శరీర భాగాల కోసం, జ్ఞాపికల కోసమూ వాటిని చంపారు. ప్రస్తుతం పులిని ప్రపంచ వ్యాప్తంగా పరిరక్షణకు గుర్తుగా వాడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సేవ్ ది టైగర్ పేరిట జాతీయ స్థాయిలో సాగుతోన్న ఉద్యమం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వం తు పాత్రను ఈ అంశంలో పోషిస్తోంది. జీవ వైవిధ్యతను కాపాడుకునేందుకు, జంతుజాలానికి అటవీ ప్రాంతాలు నెలవుగా ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. అభయారణ్యాల్లో ప్రత్యేక చర్యలతో వాటికి భద్రతను కల్పిస్తోంది. మన పక్కనే ఉ న్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫా రెస్ట్, జన్నారం అభయారణ్యంలో ఈ రకంగా వేగంగా అడుగు లు పడుతుండగా... మన జిల్లాలో పరిస్థితులు అందుకు భిన్నం గా తయారైంది. జంతుజాలానికి కనీసం దప్పిక తీర్చే పరిస్థితు లు ఇక్కడ లేకపోవడంతో చిరుతలు రోడ్డెక్కి మైదాన ప్రాంతాలకు చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా మృత్యువాత పడుతుండ డం జంతు ప్రేమికులను కలిచి వేస్తోంది. వేసవి కాలం మొదలై నెల రోజులు దాటినప్పటికీ జిల్లా అటవీ శాఖ సిబ్బంది నేటికీ పూర్తిస్థాయిలో నీటి సౌకర్యం కల్పించకపోవడం శోచనీయం. జంతువుల కదలికలను బట్టి వాటి ఆవాసాల్లో ఏర్పాట్లు చేయ డం మూలంగా వాటి మనుగడ ఉంటుందని నిపుణులు చెబుతుండగా... ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు.అడవులను సంరక్షించేందుకు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే జంతు గణనను నిర్వహించింది. జనాభా వివరాల సేకరణ మాదిరిగానే వినూత్న పద్ధతిలో శాస్త్రీయ విధానంతో జంతువుల లెక్కలను తీశారు. దీని ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని అడవుల్లో 50కి పైగా చిరుతలు ఉన్నట్లుగా గుర్తించారు. ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, మనుబోతులు, అడవి కుక్కలు వందలాదిగా ఉన్నాయని అటవీ శాఖ వెల్లడిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నాలుగు డివిజన్లున్నాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 52,133 హెక్టార్ల విస్తీర్ణం, ఆర్మూర్‌లో 33,778 హెక్టార్లు, కామారెడ్డి 40,500 హెక్టార్లు, బాన్సువాడ డివిజన్‌లో 40,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎలుగుబండ్లు, చిరుతలు, అడవి పం దులు, జింకలు, నక్కలు, నెమళ్లు భారీగానే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో జంతువులకు సరైన రీతిలో సంరక్షణ చర్యలు కరువవ్వడంతో అవి అడవుల నుంచి బయటకొచ్చి మృత్యువాత పడుతున్నాయి.