YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అంతర్జాతీయ విత్తన ధృవీకరణపై శిక్షణ సమావేశాలు

అంతర్జాతీయ విత్తన ధృవీకరణపై శిక్షణ సమావేశాలు

అంతర్జాతీయ విత్తన ధృవీకరణపై 5 రోజుల శిక్షణ సమావేశాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం హైదరాబాద్ లో  ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 7 వ తేది వరకు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ నాణ్యమైన విత్తన ఎగుమతులే లక్ష్యంగా అన్ని రాష్ట్రాల విత్తన ధృవీకరణ సంస్థల మరియు దేశంలోని అన్ని విబాగాల సిబ్బందితో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు, విత్తనాభివృద్ధిసంస్థల అధికారులకు మరియు ప్రైవేటు విత్తన కంపనీల ప్రతినిధులకు ఇప్పించడం జరుగుతున్నది.ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం “తెలంగాణ – ప్రపంచ విత్తన బండాగారం” సాధనకై పలు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి, ఎగుమతికి అవకాశాలు అపారంగా ఉన్నా యన్నారు. నేలలు, వాతావరణ పరిస్తితులు అత్యంత అనుకూలమని, భారత దేశం లో 2008 లో చేరిందని, మొదటగా 2016 ఫిబ్రవరిలో తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు గుర్తింపు వచ్చి ప్రస్తుతం దక్షిణ భారత పది (10) రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు గా పనిచేస్తుందన్నారు.ఒక సంవత్సరం కాలంలోనే అంటే, 2016-17 లోనే దేశంలో మొదటిసారి 2251 ఎకరాలలో 17,000లకు పైగా క్వింటాళ్లు విత్తనం అంతర్జాతీయ ధృవీకరణ చేసినాము. సూడాన్, ఈజిప్ట్ ,ఫిల్లిప్పీన్స్ దేశాలకు ఎగుమతి చేసినాము. ఈ సంవత్సరం 2017-18లో 2567 లకు పైగా ఎకరాలలో ఉత్పత్తి చేసి, 26,000 క్వింటాళ్ళ విత్తనం ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత సంవత్సరం నాలుగు (4) కంపనీలు మాత్రమే చేపట్టగా ఈ సంవత్సరం తొమ్మిది (9) కంపనీలు చేపట్టినాయి. భారత దేశంలో విత్తన ధృవీకరణ అమలుకై టాస్క్ ఫోర్స్ ఏర్పాటై, మూడు (3) సార్లు సమావేశమై విత్తన ఎగుమతులను 1% నుండి 10%కి పెంచాలని నిర్దేశించారన్నారు. ప్రస్తుతం జాబితాలో 231 రకాలు/హైబ్రిడ్ లు  ఉన్నాయి. ఏ ఒక్క దేశంలోనైనా ప్రాచూర్యము పొందిన పంటల రకాల/హైబ్రిడ్ లను జాబితాలో చేర్పించడాన్ని సరళీకరణ చేసి విత్తన ధృవీకరణ చేయటం జరుగుచున్నదన్నారు. హైదరాబాద్ లో విత్తన ఎగుమతి ప్రోత్సాహక మండలి మరియు విత్తన పార్కు ను నెలకొల్పి  ద్వారా ప్రోత్సహించ దలిచినామన్నారు. మరియు దేశాలకు విత్తన ఎగుమతులను ప్రోత్సహించ దలిచా మన్నారు. ఈనెల 7న జరిగే శిక్షణ ముగింపు కార్యక్రమానికి భారత ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శి అశ్విన్ కుమార్,  గారిని ఆహ్వానించామన్నారు.  తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డా. కే. కేశవులు గారు స్వాగతోపన్యాసమిస్తూ నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని క్షేత్రస్తాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ సహకార ముఖ్య కార్యదర్శి పార్థసారథి, గారు పర్యవేక్షిస్తున్నారని కొనియాడారు. విత్తన రంగంలో డా. హంచనాల్ అని చెప్పుతూ 40 సంవత్సరాల అనుభవం ఉందని, ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దారని చెప్పారు. భారత ప్రభుత్వ పూర్వ డిప్యూటీ కమిషనర్ భారత దేశo అంతర్జాతీయ విత్తన ధృవీకరణలో చేరటానికి విశేష కృషి చేసినారన్నారు. త్రివేది భారత ప్రభుత్వ పూర్వ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన  తెలంగాణ అనతికాలంలోనే దేశంలో నెం. వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. హంచనాల్, మొక్క రకాల, రైతు హక్కుల పరిరక్షణ సంస్థ పూర్వ అధ్యక్షులు మాట్లాడుతూ విత్తనం కేంద్రీయ ఉత్పాదకమని చెప్పుతూ వ్యవసాయ ఉత్పత్తికి ఉత్పాదకత పెంచటానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనన్నారు. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన మోతాదులో నాణ్యమైన విత్తనం లభ్యమైతే దిగుబడి 20% పెరుగుతుందన్నారు. పథకాలు విజయవంత మవటానికి మానవవనరుల నైపుణ్యాభివృద్ధి జరగవలసిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తన ధృవీకరణలోసాధించిన ప్రగతిని, తీసుకున్న చొరవను ప్రశంషించారు. పార్థసారథి, మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ / ప్రైవేటు విత్తన పరిశ్రమ ఇప్పటివరకు లేదని, ఇది అత్యంత అవసరమని నొక్కిచెప్పారు. దేశ నలుమూలలనుంచి హాజరవుతున్న శిక్షణార్తులందరూ రాయబార్లు (అంబాసిడర్లు)గా పనిచేయాలన్నారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మొదలగు సార్క్ దేశాలకు గల విత్తన ఎగుమతులను ప్రోత్సహించాలని మరియు విత్తన ఎగుమతి ప్రోత్సాహక మండలి స్టాపించి సదుపాయం కల్పించాలని ఆకాంక్షించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో అంతర్జాతీయ విత్తన ధృవీకరణ నైపుణ్యులు ఎడ్డీ గోల్డ్ శాగ్, గెర్రి హాల్, డా సౌమిని, ఇండోజెర్మన్ విత్తనాభివృద్ధి సహకార ప్రాజెక్టు జాతీయ సమన్వయకర్త మరియు డిప్యూటీ డైరెక్టర్లు జి.సుదర్శన్, రవీందర్ రెడ్డి, భాస్కర్ సింగ్ పాల్గొన్నారు.

Related Posts