YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆకులే...గిరిజన మాస్కులు

ఆకులే...గిరిజన మాస్కులు

ఆకులే...గిరిజన మాస్కులు
అదిలాబాద్, మార్చి 31
కరోనా సోకకుండా అడవుల్లో ఉండే గిరిజనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకులతో సొంతంగా మాస్కూలు తయారుచేసి ముఖాలకు ధరిస్తున్నారు. నాలుగు గంటలపాటు తాజాగా ఉండే ఈ ఆకుల మాస్కులు ధరించి గొత్తికోయలు రోజువారి పనులు చేసుకుంటున్నారు. బ్రేక్ డౌన్ తో గొత్తికోయల జీవనం దీనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఆదివాసీలు నివసిస్తున్నారు. అడవిలో దొరికే వస్తువులు సేకరించి వారాంతపు సంతలో అమ్ముకుని జీవనం సాగిస్తారు. కరోనా బ్రేక్ డౌన్ తో వారాంతపు సంతలు మూసివేయడంతో వీరి బతుకు దుర్భరంగా మారింది. వీరికి రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ , నగదు లభించడంలేదు. తమకు కూడా ఉచిత రేషన్ అందించి ఆకలి చావులతో కాపాడాలని వేడుకుంటున్నారు. కరోనాపై గొత్తికోయలు అవగాహన పెంచుకుంటున్నారు. చెట్ల ఆకుల ద్వారా మాస్కులు తయారుచేసుకుంటున్నారు. ముఖాలకు ఆకుల మాస్కుల ధరించి వైరస్ సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఆకుల మాస్క్ నాలుగు గంటలపాటు తాజాగా వుంటుంది. ఇళ్లలోనే వుంటూ తమ పనులు చేసుకంటున్నారు.

Related Posts