లాక్ డౌన్ తో నడకే శరణ్యం
హైద్రాబాద్, మార్చి 31
కంటికి కనిపించని సూక్ష్మజీవి బడుగు జీవితాలపై పంజా విసిరుతోంది. ఎక్కడో చెనాలో బయటపడ్డ వైరస్ ఖండాంతరాలను దాటుకొని ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఓ వైపు ప్రాణభయం మరో వైపు బతుకు భయం సగటు నగర జీవిని వెంటాడుతుంది. 30 రోజుల పాటు శ్రమించి పనిచేస్త వచ్చే నెలసరి వేతనం ఇళ్లు గడవడానికి అంతంత మాత్రంగా సరిపోతుంది. అలాంటిది వచ్చేనెల వేతనాలు వస్తాయో రావో తెలియని దుస్థితిలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక దినసరి కూలీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కరోనా దెబ్బకు వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. మహానగరంలో నివసిస్తున్న అత్యధిక జనాభా ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులు, పబ్‌ల్లో పనిచేస్తుంటారు. కరోన పుణ్యమా అని పర్యాటక కేంద్రాలు సైతం మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేసుకొని జీవనం సాగించే వారు లక్షల్లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు కడుపు చేతపట్టుకొని భాగ్యనగరానికి వసల వచ్చిన వారు ఉంటారు. చిన్నపాటి ఇళ్లల్లో నివాసం ఉంటూ జీవన పోరాటం సాగిస్తున్న ఎందోరో బడుగులపై కరోన ప్రభావం కనిపిస్తుంది. వైరస్ సోకుతుందన్న భయం కంటే తమ జీవితాలను ఎలా వెళ్లదీయాలనే భయం తమను తీవ్రంగా వెంటాడుతుందని పేర్కొంటున్నారు. విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం ఏ స్థాయిలో ఆదుకుంటుందోనన్న తెలియక వారిలో వారు మధనపడుతున్నారు. ఇంటి అద్దె నుంచి నిత్యవసరాలను సైతం కొనుగోలు చేసుకోలేని దుస్థితి వస్తుందేమోనని చింతిస్తున్నారులాక్ డౌన్ తో చాలా మంది వలస కూలీలు తమ సొంత గ్రామాలకు వెల్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంబించి పోవడంతో పది ఇరవై కిలో మీటర్లు కాదు ఏకంగా వందల కొలో మీటర్లు నడిచి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.పాత కాలంలో రవాణా వ్యవస్థ అమలులోకి రాక ముందు ఏ విధంగానైతే పూర్వీకులు వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వెల్లే వారో ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ వృద్దుడు తన ఇంటికి చేరుకోవడానికి ఏకంగా 115 కిలో మీటర్లు నడిస్తే, కొంత మంది కూలీలు 250 కిలో మీటర్లు నడిచి గమ్యం చేరుకున్నారు. అంతే కాదు ఓ యువకుడు తన తల్లి మరణవార్త విని ఏకంగా 500పైచిలుకు కిలో మీటర్లు నడక ప్రయాణం చేయడానికి పూనుకుని 350 కిలో మీటర్లను 3 రోజుల్లో నడిచారు. ఇప్పుడే ఇదే కోణంలో మరో పది మంది వ్యక్తులు కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం దొరతండాకు చెందిన పది మంది కర్ణాటకకు ఉపాధి కోసం వెళ్లారు. అక్కడే కష్టం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాగా కరోనావైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో అక్కడ వ్యవస్థలన్నీ స్థంబించి పోయాయి. వలస కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారందరూ అక్కడ ఉండలేక స్వగ్రమానికి వెల్లాలనుకున్నారు. అయితే లాక్ డౌన్ వలన రవాణా వ్యవస్థ పూర్తిగా స్థింబించి పోవడంతో స్వగ్రామం చేరుకునేందుకు వారు నడకను ఆశ్రయించారు. అలా కర్ణాటకలోని చించోలి నుంచి 100 కిలో మీటర్లు నడకదారిగుండా స్వగ్రామం దొరితండాకు చేరుకున్నారు. అలా చేరకున్న వారిని అధికారులు గ్రమంలోకి వెల్లక ముందే వారికి ప్రభుత్వ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు