కొనసాగుతున్న శ్రీవారి నిత్య కైంకర్యాలు
తిరుమల మార్చి 31
తిరుమలలో స్వామివారికి జరుగుతున్న కైంకర్యాలు అన్ని శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. సుమారు 15 మంది అర్చకులు నిత్యం తిరుమలలోనే ఉండి స్వామివారి జరగవలసిన కైంకర్యాలు...పూజలు అన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారిని ప్రతిరోజు ఉదయం 3 గంటలకు సాంప్రదాయా ప్రకారంగా మేల్కొలిపి గో క్షిరంతోపాటు నవినితాన్ని ప్రధమ నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం జరుగుతుందన్నారు.అటుతరువాత తోమాల,కొలువు,అర్చన ఇలా స్వామివారికి జరగవలసిన ఆరాధన కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయన్నారు.భక్తుల నిషేధంలో భాగంగా సమయం ఎక్కువ ఉన్నందున రాత్రి 8.30 నుండి 9 గంటల మధ్యలో ఏకాంత సేవను నిర్వహిస్తున్నామని అన్నారు....కొంతమంది పనిగట్టుకొని స్వామివారి కైంకర్యాలు,దీపాల కొండెక్కాయని ప్రసార మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి అపోహలు ఎవరు నమ్మొద్దని అన్నారు ఆలయ ప్రధాన అర్చకుడు.....ప్రపంచ మానవాళి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఈ నెల 26 ,27,28 న ధన్వంతరి యాగాన్ని చేసినట్టు అయన గుర్తు చేశారు. మరోవైపు, ఏప్రిల్ 2 న జరిగే శ్రీరామనవమి వేడుకలను ఏకాంతంగా తిరుమల శ్రీవారి ఆలయం లో జరగనున్నాయి. రంగనాయక మండపంలో శ్రీరాముడికి స్నపన తిరుమంజన ఆస్థానం నిర్వహిస్తున్నట్టు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.ఈ శ్రీ రామనవమినాడు ముఖ్య అధికారుల సమక్షంలో శ్రీ రాముని పట్టాభి షేకం వైభవంగా ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి రోజు హనుమంత వాహనపు సేవను రద్దు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. అదేవిధంగా 5 నుండి 7 వరకు జరిగే వార్షిక వసంతోత్సవాలను ప్రధాన ఆలయంలోనే జరిగే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.