నిరుపేదలకు అపన్న హస్తం
కోరుట్ల మార్చి 31
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ నేపథ్యంలో సైనికుల్లా సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికులకు, పోలీసు సిబ్బందికి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రామ్ యువసేన, శబరిష సేవా సమితి ఆపన్న హస్తం అందిస్తోంది. కోరుట్ల పట్టణంలో తిండి తిప్పలు లేక అవస్థలు పడుతున్న జనాలు, వలస కార్మికులను ఎందరో ఉన్నారు. అలాంటి వారి ఇబ్బందిని చూసి మనసు చలించి తన వంతుగా తోచిన సాయం చేద్దామని పట్టణ పురోహితులు పాలేపు రామకృష్ణ శర్మ మరియు అతని స్నేహితులు ముందుకొచ్చారు. గత వారం రోజులుగా కరోన మహమ్మరిని తరిమికొట్టడానికి నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్, పోలీసు సిబ్బందికి సమయానికి ఆహారం బయట దొరకడం లేదు. దానితో కొంత సిబ్బంది ఇబ్బందిపడుతున్న సమయంలో రామ్ యువసేన ఆపన్న హస్తంలా వారిని ఆదరిస్తుంది. వారితో పాటు పక్క రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి వచ్చే దినసరి కూలీలకు, వారి కుటుంబానికి కూడా సమయానికి ఆహారం అందిస్తూ మానవ సేవాయే మాధవ సేవా అనే నీటివాఖ్యానికి సరియైన నిర్వచనం చూపిస్తున్నారు.. లాక్ డౌన్ నుండి గత వారం రోజులగా ప్రతి రోజు స్వయంగా వారే వండి, ప్యాకింగ్ చేసి దాదాపు 400 నుండి 600 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి కూడా భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. పక్కోడు ఎలా ఉంటే ఏందిలే.. మనం, మన కుటుంబం బాగుంటే చాలు.. అనుకునే ఈ రోజుల్లో.. ఎవరో ముక్కు మొహం తెలియని సుమారు 500 మందికి గత వారం రోజుల నుండి ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం ఆహారం అందిస్తూ వారి కడుపు నింపుతూ ఆనందాన్ని పొందుతున్నారు రామ్ యువసేన మరియు శబరిష సేవా సమితి సభ్యులు..