సేవా కార్యక్రమాల్లో వీహెచ్పీ
హైదరాబాద్ మార్చి 31
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలు , రాష్ట్రాల నుంచి భాగ్యనగర్ కు వలస వచ్చిన కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, యాచకులు, అనాధలకు ఆహారపు పొట్లాలు అందిస్తున్నారు. వండుకునే అవకాశం ఉన్న వారికి బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు, నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు కూడళ్ల తోపాటు గల్లీ లో ఉన్నటువంటి వారికి కూడా ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో నడుచుకుంటూ వారి వారి గ్రామాలకు వెళుతున్న వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇంకెవరికైనా వైద్య సహాయం అవసరమైన కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ రాజు, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పలువురు కార్మికులకు భాగ్యనగర్ లోని అత్తాపూర్ దగ్గర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంకెవరికైనా ఎటువంటి సహాయం అవసరం ఉన్నా.. విశ్వహిందూ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు సూచించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సరుకులు, ఆహారం, నిత్యవసర వస్తువులు అందించేందుకు విశ్వహిందూ పరిషత్ నుంచి ఏడు వాహనాలకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. దాతలు సహకరించండి :: బండారి రమేష్ అన్ని జిల్లా కేంద్రాలు, ప్రకండ కేంద్రాలు, గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో లీనం కావాలని వీహెచ్పీ కార్యదర్శి బండారి రమేష్ కోరారు. జనతా కర్ఫ్యూ లో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించ కుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏం అవసరమో, వాటిని తీర్చేందుకు క్షేత్రస్థాయిలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో సమాజానికి కి సహాయం అందించేందుకు కార్యకర్తలు అన్ని విధాలా ముందు ఉండాలన్నారు. వస్తు రూపేనా, నగదు రూపేణా వి హెచ్ పి కి సహకరించాలని కోరారు. మందుల పంపిణీ.. అశ్వినీ హెయిర్ ఆయిల్ అధినేత సుబ్బారావు అందించిన మందులను ఆయా ప్రాంతాల్లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. హోమియోపతి వైద్యం చే తయారుచేసిన మాత్రలను వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని... కరోనా లాంటి వైరస్ సోకే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయని అశ్విని సుబ్బారావు గారు వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజలకు మాత్రలు పంపిణీ చేశామని చెప్పారు. ఈ మాత్రలు అవసరమైన వారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. రోడ్ల వెంబడి పోలీసులతోపాటు కనిపించిన వారికల్లా కాలనీలు, గ్రామాల్లోని వారికి వీహెచ్పీ కార్యకర్తలు మందులను పంపిణీ చేస్తున్నారు.