YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 కాశీ గాయత్రి ఆశ్రమ సేవలు అభినందనీయం

 కాశీ గాయత్రి ఆశ్రమ సేవలు అభినందనీయం

 కాశీ గాయత్రి ఆశ్రమ సేవలు అభినందనీయం
విశాఖ జిల్లా కాశీనాధుని భక్తులు
నెల్లూరు మార్చి 31
కాశీ పుణ్యక్షేత్రంలో  ఉన్నటువంటి కాశీ గాయత్రి ఆశ్రమం సేవలు అభినందనీయమని విశాఖ జిల్లా కాశీనాధుని భక్తులు పేర్కొన్నారు. స్థానిక కాశీ గాయత్రి ఆశ్రమం లో నుండి వారు తెలిపిన వివరాల మేరకు కాశీనాధుని తొమ్మిది రోజుల నవ దివస దీక్షలో భాగంగా విశాఖ జిల్లా నుండి కాశీకి రావడం జరిగిందన్నారు. ఈ గ్రామంలో కాశీ ఘాట్ లో వివిధ ఇబ్బందులు ఎదుర్కొని తొమ్మిది రోజుల దీక్ష పూర్తి చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల రవాణా బందు చేయడం కారణంగా గా విశాఖ జిల్లా నుండి 14 మంది భక్తులతో పాటు మరో కొంతమంది అన్నపానీయాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కాశి గాయత్రి ఆశ్రమం నిర్వాహకులు అందరికీ ఆసరా కల్పించి మూడు పూటలా ఆహారం అందిస్తూ తమ ప్రాణాలను కాపాడుతున్నారని ఆశ్రమ సేవలు తెలియజేశారు. ఆశ్రమ నిర్వాహకులు అబ్బూరి హరిహర శాస్త్రి, మహాదేవి దయ సేవాగుణం తో ఆశ్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుతున్నట్టు తెలిపారు.
 

Related Posts