YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కరోనాని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది

 కరోనాని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది

 కరోనాని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది
ప్రజల సహకారంతో కరోనాని నివారించడం పెద్ద కష్టతరం కాదు
పెనుకొండ మార్చి 31
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అదేవిధంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఏప్రిల్ 14 వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను పాటించి కరోనామహమ్మారిని నిర్మూలించేందుకు దోహద పడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో కరోనా నివారణ నేపథ్యంలో శంకర్ నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధులలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అదేవిధంగా  ప్రజలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నిర్దేశించిన సమయం లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను పరిశీలించి ప్రజలకు సామాజిక దూరం పాటించాలని అని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వలస కార్మికుల కోసం ఏర్పాటుచేసిన శిబిరంలో వారికి అందుతున్న సేవలను పరిశీలించారు .ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ ఉద్యోగులు, పోలీసులు వైద్యులు అనితరమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన వాలంటరీ వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుందని వారు అనునిత్యం ప్రజా సేవలు అంకితం అవుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయం అవుతుందని తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు సరఫరా చేస్తూ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ని తెలిపారు వచ్చే నాలుగో తేదీ ప్రతి పేద కుటుంబానికి వెయ్యి రూపాయల నగదు ఇచ్చిఆ కుటుంబాలను ఆదుకునేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అంతేకాకుండా వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వారికోసం క్వారంటీన్ వార్డులను ఏర్పాటు చేసి వారికి కనీస అవసారాలను అందిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్, మంత్రి నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టిమ్ ను  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మండలానికి క్వారంటీన్ హోమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రజలందరూ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నారని అదేవిధంగా  రాష్ట్ర ప్రజలు సామాజిక దూరం పాటించి వ్యక్తిగత శుభ్రత తో ఇంటికే పరిమితమైతే కరోనాని అరికట్టడం కష్టతరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మోతి కృష్ణ, ఎంపిడిఓ శివశంకరప్ప, ఎమ్మార్వో నాగరాజు, సిఐ శ్రీ హరి, ఎస్సై హారూన్ బాషా, వైఎస్సార్ సిపి నాయకులు సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, లాయర్ భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ తయూబ్, లాయర్ ఫరూక్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితర అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts