YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం జ్ఞానమార్గం తెలంగాణ

 రాములోరి పెళ్లికి భక్తులు రావోద్దు

 రాములోరి పెళ్లికి భక్తులు రావోద్దు

 రాములోరి పెళ్లికి భక్తులు రావోద్దు
హైదరాబాద్ మార్చి 31,
ఏప్రిల్ 2 భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని, కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు అనుమతి లేదని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 2న స్వామివారి ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించనున్నామని.. కరోనా దృష్ట్యా భక్తులు ఎవరూ సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు అందులో పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ పరిస్థితిని భక్తులు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని వారు కోరారు. అలాగే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ వేడుకలు నిర్వహించ వద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related Posts