నిరాడంబరంగా సాంప్రదాయ బద్దంగా శ్రీరామ నవమి
విజయవాడ మార్చి 31
ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతించని కారణంగా, అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రధాన వైష్ణవాలయాల్లో ఏప్రిల్ 2న అర్చకులు మాత్రమే శ్రీరామనవమి వేడుకలు సామాజిక దూరం పాటిస్తూ నిర్వహిస్తారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రధాన దేవాలయాల్లో స్వామివారికి అమ్మవార్లకు నిత్యం జరిగే నివేదనలు సర్కారీ పూజలు యధా విధంగా జరుగుతున్నవి ప్రజా ఆరోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనాలను వాయిదా వేసుకోవలసిందిగా, ఇంట్లోనే శ్రీ రామ నవమి పూజలు నిర్వహించుకోవాల్సిందిగా మంత్రి కోరారు. అందరూ బాగుండాలని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం జగన్మోహన రెడ్డి గారు చేస్తున్న కృషి ఫలించాలని ఆ శ్రీరాముని వేడుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.