YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పట్టుపరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు

పట్టుపరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు

ప్రగతి పధంలో పట్టుపరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టామని ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి  చెప్పారు. పట్టు ఉత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం పురోగమణంలో ఉన్నదని చెప్పారు.ఒక మల్బరీ తోట ద్వారా సంవత్సరం పోడువునా ఐదు గురికి  ఉపాధిలభిస్తోందని అన్నారు.ప్రకృతి సిద్దంగా లభించే మూడు రకాల పట్టు  ఇది సరళి మల్బరీ పట్టుపరిశ్రమ చేనేత రంగానికి వెన్నెముకలాంటి పరిశ్రమ అన్నారు. మల్బరీ బహు వార్షిక పంట నీటి నిల్వలనే పొదుపుగా వాడుకొని ఎక్కువ లాభం కోసం అందించగల పరిశ్రమ అని పేర్కొన్నారు. ఎకరం మల్బరీ తోటలో ఉత్పత్తి చే పట్టు  గూళ్ళ  ద్వారా ఎడాదికి  రూ.50 వేల నుంచి లక్ష నికరాదయం లభిస్తుందన్నారు. పట్టుపరిశ్రమలో రాష్ట్రంలోని మారుమూల గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ అన్నారు. మల్బరీ రైతులకు అదనపు ఆదాయంతో పాటు పాడిపరిశ్రమ సేంద్రియ ఎరువుల ఉత్పత్తి చేపట్టవచ్చున్నారు. పట్టుపరిశ్రమ చేపట్టిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,పట్టుపరిశ్రమలశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి పార్థసారధి ప్రోత్సహాకాలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. సిఎస్వి సబ్సిడీలు, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా యూనిట్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. పట్టుపరిశ్రమ ఎగ్జిబిషన్స్ ద్వార రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.మల్బరీ తోటల పెంపకాల గురించి ఆయన వివరించారు. పేదల భూముల్లో పండ్ల తోటల పెంపకం కోసం జిల్లానీటి నిర్వహణ సంస్థ,ఉద్యానవన సంస్థల సమన్వయంతో చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పండ్ల తోటల పెంపకం రైతులకు తమ  శాఖ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.పండ్ల తోటల పెంపకం అధిక లాభదాయకమని ఆయన అన్నారు.రైతులు మల్బరీ, పంట తోట పెంపకంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనేక ప్రాంతాలను సందర్శించి మల్బరీ తోటల అభివృద్ధికి  చర్యలు తీసుకున్నామని కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి చెప్పారు. భవనాలపై మన కూరగాయల సాగుపై దృష్టిసారించామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 40 లక్షల  ఇండ్లు  ఉంటే కేవలం 6 వేల మంది భవనాలపై  మన కూరగాయల పథకంలో     2010 నుంచి సాగు చేస్తున్నారని తెలిపారు.అన్ని నగరాలలో భవనాపై కూరగాయలు, పండ్లమొక్కలు, ఆకుకూరలు, బెండకాయ, నిమ్మకాయ,  వంకాయ, గోరుచిక్కుడు, ఉల్లిగడ్డలు, గోంగూర, పూలమొక్కలను  పెంచుకోవచ్చునని తెలిపారు.

Related Posts