YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ప్రతి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: పువ్వాడ

ప్రతి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: పువ్వాడ

ప్రతి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: పువ్వాడ
ఖమ్మం మార్చి31 
ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలు మేరకు ఖమ్మం జిల్లా రైతాంగానికి మంత్రి పువ్వాడ భరోసా ఇచ్చారు. ఖమ్మం భక్తరామ దాస్ కళాక్షేత్రంలో వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్, ఎఫ్సీఐ, సివిల్ సప్లై శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. రబీ మాసంలో రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కష్టతరమైన పరిస్థితులలో కూడా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు అమలు జరిగేలా చూడాలన్నారు. ఈ కఠిన పరిస్థితులలో కూడా రైతాంగం ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటున్న చర్యలను అనుగుణంగా పని చేయాలన్నారు.జిల్లాలోని ప్రతి గింజ ను ప్రభుత్వం కొనుగొలు చేస్తుంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలుకు అవసరమయ్యే గన్ని బ్యాగ్స్ కి ఎలాంటి కొరత లేదని, కావాల్సినవన్నీ ఉన్నాయన్నారు. జిల్లాలో సాగు అయిన వారి, మిర్చి, పుచ్చకాయ, బొప్పాయి, మొక్క జొన్న, తదితర పంటల సేకరణకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కొనుగోలుకు మీకు టోకెన్ ఇస్తారు. ఆ రోజు వస్తే సరిపోతుంది. రైతులు తొందర పడొద్దు. సంయవనం పాటించాలి. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూ  నడుచుకోవలని కోరారు.రైతు పండించిన ప్రతీ గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని, ఆ నిర్ణయం అమలుకు ప్రణాలికను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఈ నిర్ణయం వలన  రైతులు ఈ కష్టకాలంలో ఏ విధంగా పంట అమ్ముకోవాలో తెలియని పరిస్థితి లేకుండా, రైతు తన ఊర్లోనే , నేరుగా ప్రభుత్వానికే అమ్మే వెసులుబాటును  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారని అన్నారు.  ప్రభుత్వం దగ్గర, తెలంగాణ ప్రజలకు కావలసిన అన్ని పంటలు ఉండడం వలన తెలంగాణ ప్రజల ఆకలిని తీర్చే వసతి ఉండబోతోందని అన్నారు. సమీక్షలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కమీషనర్ ఆఫ్ పోలీస్ తాఫ్సిర్ ఇక్బాల్ ,  విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,  రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు,  ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,  రాములు నాయక్,  మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ  పోలీస్ కమీషనర్ మురళీధర్  తదితరులు ఉన్నారు.

Related Posts