YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు, కారెంపూడి, మాచర్ల పట్టణాలలో కర్ఫ్యూ విధింపు

గుంటూరు, కారెంపూడి, మాచర్ల పట్టణాలలో కర్ఫ్యూ విధింపు

గుంటూరు, కారెంపూడి, మాచర్ల పట్టణాలలో కర్ఫ్యూ విధింపు
గుంటూరు మార్చి31 
మర్కజ్ మసీదులో మత సదస్సుకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలని అలా కాకుండా తమకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హెచ్చరించారు. నేటి నుంచి గుంటూరు, కారెంపూడి, మాచర్ల పట్టణాలలో కర్ఫ్యూ విధించినట్లు ఆయన ప్రకటించారు.ఢిల్లీ లో మీటింగ్ కి వెళ్లిన వారు, వారి భార్య లకు పాజిటివ్ కేసులు వచ్చాయని ఆయన అన్నారు. ఇప్పటికే 180 మంది లో 140 మంది ని గుర్తించామని ఆయన తెలిపారు. వారిపై 103 కేసులలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 5గురికి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. గుంటూరు లో ఇద్దరు, మాచర్లలో ఇద్దరు, కారంపూడిలో ఒక్కరికి పాజిటీవ్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన 40 మంది కోసం వెతుకుతున్నామని కలెక్టర్ వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటికే వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇస్తాం. ఎవరూ బయటకు రావద్దని ఆయన కోరారు.

Related Posts