YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పది నెలల పసికందుకు కరోనా

పది నెలల పసికందుకు కరోనా

 

పది నెలల పసికందుకు కరోనా
బెంగళూరు మార్చ్ 31
ఇప్పట్లో కరోనా కష్టాలు తగ్గెలా కనిపించడం లేదు.పెరుగుతున్న సంఖ్య ప్రజలతో పాటు వైద్యరంగ నిపుణులను సైతం సవాల్ విసురుతున్నాయి.ప్రజలను బయటకు రాకుండా ఇంట్లో ఉండేలంటూ కేంధ్ర ప్రభుత్వం లాక్ డైన్ విదానాన్ని అమలు చేస్తున్నా ... పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది.తాజాగా కర్ణాటకలో మరో కోవిడ్ కేసులను గుర్తించడంతో.. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 83కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో పది నెలల పసికందు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ బాబు తల్లిదండ్రులది దక్షిణ కన్నడ జిల్లా కాగా.. వారెవరూ విదేశాలకు వెళ్లి రాలేదు. కానీ ఇటీవలే ఆ కుటుంబం కేరళ వెళ్లి వచ్చిందని సమాచారం. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపడున్నామని తెలిపిన అధికారులు... కాంటాక్ట్ అయిన ఆరుగుర్ని క్వారంటైన్‌కు తరలించారు. కొలంబో వెళ్లి మార్చి 15న బెంగళూరు తిరిగొచ్చిన 20 ఏళ్ల యువకుడికి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతడికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు. లండన్ నుంచి మార్చి 18న బెంగళూరు తిరిగొచ్చిన 25 ఏళ్ల యువతికి కూడా కరోనా సోకినట్లు తేలింది. కరోనా పేషెంట్ ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళకు కూడా కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో వీరిద్దర్నీ ఐసోలేషన్‌కు తరలించారు.దుబాయ్‌కు వెళ్లి వచ్చిన ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా సోకగా.. తుమకూరు జిల్లాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 13న ఆయన ఢిల్లీ నుంచి రైలు ద్వారా కర్ణాటక వచ్చాడు. అతడికి కలిసిన 24 మంది వివరాలను సేకరించిన పోలీసులు 13 మందిని హాస్పిటల్‌లో ఐసోలేషన్లో ఉంచారు. దీంతో కర్ణాటకలో కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. గుల్బార్గా జిల్లాకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ బారిన పడి చనిపోగా.. చిక్కమంగళూరుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కూడా కోవిడ్ కారణంగా చనిపోయింది.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.సిఎం యడియూరప్ప అధికారులతో ఎప్పటికప్పుడు విధాన్ సౌదా నుంచి వీడియో కాన్సిరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేస్తున్నారు.మరోవైపు పారిశుద్య కార్మికులతో శానిటైజేషన్ ను పరిశీలిస్తున్నారు.బ్లీచింగ్ జల్లుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పతిష్టమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts