సీనియర్ సిటీజన్స్ కు కేంద్రం సూచనలు
జగిత్యాల మార్చి 31
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్ సిటీజన్స్ కు ప్రత్యేక సూచనలు జారీ చేసిందని తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ సీనియర్ సిటీజన్స్ సమాచారార్థం తెలిపారు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులను శుభ్రం చేసుకోవాలి.ఇంటికి వచ్చే వారితో సమావేశం కాకుండా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో కూడ నిర్ణీత దూరం పాటించాలి.ఇంట్లొ వండిన వేడిఆహార పదార్థాలు మాత్రమే తినాలి.శరీరం డీహైడ్రేట్ కాకుండా మంచి నీరు పండ్ల రసాలు తాగుతుండాలి. వాడుతున్న మందులను కొనసాగిస్తూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. జ్వరం, దగ్గు,జలుబుకు సొంత వైద్యం తీసుకోవద్దు.జ్వరం, దగ్గు,జలుబు వస్తే శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వట్టి చేతులతో ముక్కు చీద కుండా కర్చీఫ్ వాడాలి. ముక్కు చీదిన తర్వాత అవే చేతుల్తో కళ్ళు,నోరును తగలకూడదు.అని ఆ సూచనల్లో పేర్కొన్నారని వివరించారు.