YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా అనుమానంతో కొట్టి చంపారు

కరోనా అనుమానంతో కొట్టి చంపారు

కరోనా అనుమానంతో కొట్టి చంపారు
పట్నా మార్చ్ 31 
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ వివిధ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావంతో మనుషుల మధ్య మరింత దూరం పెరిగింది. తుమ్మినా దగ్గినా శతృవులా చూస్తున్నారు. ఆ వ్యాధి సోకిన వ్యక్తులను అంటరాని వాళ్లలా పరిగణిస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితుల్లో  పట్నాలో  దారుణం చోటుచేసుకుంది.  కరోనా ఉందన్న అనుమానంతో కొందరు యువకులు అతడిని కొట్టి చంపారు. ఘటన బిహార్లోని సీతామర్హి జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్కు చెందిన ఓ కార్మికుడు ఉపాధి కోసం మహారాష్ట్ర వలస వెళ్లాడు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అతను కుటుంబంతో సహా.. స్వస్థలం బిహార్ కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్థానికులు ఆ కార్మికుడిని స్వగ్రామంలోకి అనుమతించేందుకు నిరాకరించారు. ఈ తరుణంలోనే  వారిద్దరు అతని పై దాడి చేసి హతమార్చారు.

Related Posts